భారత దేశం నుంచి అమెరకా వెళ్లి అక్కడే స్థిరపడిన వారు చాలా మంది తెలుగు భాషాభివృద్దికోసం పాటుపడుతున్నారు. ముఖ్యంగా నార్త్‌ అమెరికా తెలుగు అసోసియేషన్‌(నాటా) ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేస్తూ అక్కడి తెలుగు వారిని ఏకం చేస్తున్నారు. నార్త్‌ అమెరికా తెలుగు అసోసియేషన్‌(నాటా) 2016 కన్వెన్షన్‌ ఈనెల 27 నుంచి 29 వరకు జరగనున్నాయని నిర్వాహకులు పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున డాలస్‌ నగరం నడిబొడ్డున అతిపెద్దదైన డాలస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం లుగు వారందరూ ఒకేచోట చేరి, కుటుంబ, సామాజిక విలువలు నిలబెట్టుకోవడం, తెలుగు భాష, సాంస్కృతి మరియు సంప్రదాయలను పరిరక్షించుకోవటం, తెలుగు సమాజాన్ని ప్రభావితం చేసే యువత భవిత లాంటి ఎన్నో విషయాల మీద రాబోయే తరాలకు చర్చించుకోవడం అని నిర్వాహకులు తెలుపుతున్నారు.

ఇక్కడ  వివిధ రకాల యూత్‌ ఈవెంట్స్‌, నాటా ఫ్యాషన్‌ ఈవెంట్స్‌, నాటా బ్యూటీ పేజెంట్‌, మహిళల కోసం స్టార్‌ మహిళ, మోడ్రన్‌ మహిళ వంటి వినోద కార్యక్రమాలు, పిల్లల కోసం కిడ్స్‌-న్‌-ఫన్‌, మేజిక్‌ షో వంటివి ఏర్పాటు చేశారు.  ఈ కార్యక్రమానికి  పలువురు సినీప్రముఖులు సంగీత దర్శకులు, కవులు, రాజకీయ ప్రముఖులు, ఆధ్యాత్మిక గురువులు తదితరులు ముఖ్య అతిథిలుగా హాజరుకానున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: