తమ కూతురు సుఖంగా సంతోషంగా ఉండాలని  చాలా మంది తల్లిదండ్రులు తమ కూతురుని ఎన్ఆర్ఐకి ఇచ్చి వివాహాం జరిపిస్తున్నారు. కానీ కొంతమంది దుర్మార్గులు అదనపు కట్నం కోసం అభం శుభం తెలియన ఎక్కడో దేశం కాని దేశంలో ఉన్నవారిని అన్యాయంగా బలి తీసుకుంటున్నారు. మరి కొంత మంది మాయమాటలు చెప్పి మోసం చేసి వివాహితలను ఇక్కడే ఉంచి వారేమో విదేశాల్లో జల్సాలు చేస్తున్నారు. ఏది ఏమైనా ఇలా ఎన్ఆర్ఐ చేతిలో మోసపోయిన తల్లిదండ్రులు మాత్రం కన్నీటికే పరిమితం అవుతున్నారు. తాజాగా ఆస్ట్రేలియాలో హైదరాబాద్కు చెందిన ఓ యువతి అనుమానస్పదంగా మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కూకట్‌పల్లికి చెందిన రమ్యకృష్ణ అనే యువతి నాలుగు ఏళ్ల క్రితం ఆస్ట్రేలియాకు చెందిన మహత్‌తో వివాహమైంది. తమ అల్లుడు గత కొంతకాలంగా అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేస్తునట్లు ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు.మెల్‌బోర్న్‌కు చెందిన మహత్‌తో తమ కుమార్తె రమ్యకృష్ణకు వివాహం అయ్యిందని వివాహ సమయంలో రెండు అపార్టుమెంట్లు, కిలో బంగారు ఆభరణాలు కట్నంగా ఇచ్చారు. మహత్ చేపట్టిన పిజ్జా వ్యాపారం కోసం కూడా రూ.40 లక్షలు అందజేశారు.

ఈ దంపతులకు ఇంకా పిల్లలు పుట్టలేదని అంతలోనే రం క్రితం ఆమె చనిపోయినట్లు కుటుంబసభ్యులకు అక్కడి నుంచి సమాచారం అందడంతో కన్నీరు మున్నీరు అయ్యారు. శుక్రవారం రాత్రి విమానంలో ఆమె మృతదేహం హైదరాబాద్ చేరుకుంది. కుటుంబసభ్యులు, బంధువులు మృతదేహాన్ని పరిశీలించి, అత్తింటి వారే చంపారని ఆరోపిస్తున్నారు.రమ్య పేరిట ఆస్ట్రేలియాలో రూ.2.5కోట్ల బీమా ఉందని... ఆ డబ్బు కోసమే రమ్యను భర్తే హత్య చేశాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: