ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవాసాంధ్రుల కోసం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సంస్థ.. ఆంధ్రప్రదేశ్ నాన్-రెసిడెంట్ తెలుగు (ఏపీఎన్ఆర్‌టీ) సొసైటీ. ఈ సొసైటీతో విదేశాల్లో ఉన్న తెలుగు వారి ఔన్నత్యాన్ని చాటి చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్లు..అంతే కాకుండా తెలుగు కీర్తి పతాకాన్ని ఎగరేస్తున్న ప్రవాసుల్ని ఒక్కతాటిపైకి తేవడానికి  ప్రభుత్వ పరంగా తోడ్పాటు అందించడం జరుగుతుందని తెలిపారు. ఇక  సొంత రాష్ట్రానికి వారి సేవల్ని ఉభయతారకంగా ఉండేలా ఈ సంస్థను ఏర్పాటు చేసింది ఏపీ సర్కారు. మే 27-29 తేదీల్లో డాలస్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన నాటా కన్వెన్షన్ వేడుకలకు ఏపీఎన్ఆర్‌టీ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ రవికుమార్ వేమూరును అతిథిగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఏపీఎన్‌ఆర్‌టీ సొసైటీ చేపడుతున్న కార్యక్రమాల గురించి ఆయన అక్కడ ప్రెజెంటేషన్ ఇచ్చారు.  

తెలుగు రాష్ట్రాలు రెండు గా విడిపోయిన తర్వాత ఆయా రాష్ట్రాల అభివృద్ది విషయంలో ముఖ్యమంత్రలు ఎన్నో అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ అభివృద్ది కోసం ఇప్పటికే విదేశాల్లో ప్రవాసాంధ్రులతో ముఖ్యమంత్రి సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు.  ఆంధ్రప్రదేశ్‌లో స్మార్ట్ విలేజ్‌లను దత్తత తీసుకోవడం.. దేవాలయాల సందర్శన.. 57 ఇండస్ట్రీలకు సహకారం అందించడం లాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు. అమెరికాలో స్థిరపడ్డ దాదాపు 300 మంది ప్రవాసాంధ్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్రంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి వారు తమ సలహాలు, సూచనలు అందించారు.

వ్యవసాయం, వైద్య రంగాల్లో పెట్టుబడులు పెట్టడం, ఏపీకి కార్యాలయాల్ని తరలించడానికి అవసరమైన ఏర్పాట్లపై ఇందులో చర్చించారు. ఐటీ సర్వ్ యూఎస్ఏ టీంతో ప్రత్యేకంగా సమావేశం కూడా నిర్వహించారు. దీనిపై ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. ఏపీఎన్‌ఆర్‌టీ డైరెక్టర్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్ కానూరి శేషుబాబు సొసైటీ చేపడుతున్న తొలి ఇన్వెస్ట్‌మెంట్ ప్రాజెక్ట్ గురించి వివరించారు. ఇప్పటిదాకా 150 యూనిట్లు ఏపీఎన్ఆర్‌టీ ద్వారా పెట్టుబడులకు ముందుకు రావడం విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి: