భారత దేశంలో నివసించే తల్లిదండ్రులు చాలా వరకు తమ పిల్లలు ఉన్నత విద్య అభ్యసించడానికి అమెరికా, ఇంగ్లాడు,లండన్ లాంటి దేశాలను పంపిస్తుంటారు. ఇక ఏపీ, తెలంగాణ లో నివసించే వారు తమ పిల్లలను ఎక్కువగా అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించేందుకు తమ పిల్లలను పంపిస్తుంటారు. ఇక ఆడపిల్లల తల్లిదండ్రులు ఎక్కువ ఎన్ఆర్ఐ సంబంధాల కోసం వెంపర్లాడుతుంటారు. అయితే ఎన్నో ఆశలు, కలలు కని వారు అమెరికా వెళ్లిన తర్వాత అక్కడ అకస్మాత్తుగా అనుకోని సంఘటనలు జరగడం తమ పిల్లల్ని కోల్పోవడంతో దుఖఃసాగరంలో మునిగిపోతుంటారు.

తాజాగా అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ నదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కృష్ణా జిల్లా యువకుడు గల్లంతయ్యారు.  వివరాల్లోకి వెళితే.. జగ్గయ్యపేట మండలం బండిపాలెం వాసి పుట్టా నరేశ్‌(24)రెండేళ్ల క్రితం ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లారు. గత రెండు సంవత్సరాలుగా తల్లిదండ్రులతో ఎప్పుడూ సంతోషంగా మాట్లాడుతూ..ఫోటోలు పంపిస్తూ సందడి చేసే నరేష్  లివర్‌మోర్‌ నదిలో స్నేహితులతో కలిసి పడవలో షికారుకు వెళ్తున్నప్పుడు ప్రమాదవశాత్తు నదిలో పడిపోయాడు.

స్నేహితులు వెంటనే స్థానిక అధికారులకు సమాచారమందించడంతో వారు నరేశ్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రమాదవశాత్తు ఒక్కసారిగా బోటు పల్టీ కొట్టడంతో నరేష్ గల్లంతయ్యారు. స్నేహితుల ద్వారా సమాచారం తెలుసుకున్న నరేష్ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ కుమారుడిని వెతికిపెట్టాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: