600 మంది ఎన్నారై లని ముంచేశారు , అసలేం జరిగింది ?

 

రియల్ ఎస్టేట్ రంగం అంటే రూపాయ్ పెడితే లక్షలు గడించచ్చు అని ఆశిస్తూ ఉంటారు అందరూ. అలాగే ఎంతమందికి నష్టం వచ్చినా రియల్ ఎస్టేట్ లో గిరాకీ తగ్గడం ఎప్పుడూ జరగలేదు కూడా. ఒక పక్క భారత్ లో  పెట్టుబడులు పెట్టాలి అనీ స్వదేశం తమకి చాలా మంచి చేస్తుంది అనీ మోడీ ఎన్నారై లకి ఘర్ వాపసీ అంటూ నినదిస్తుంటే మరొక పక్క పరిస్థితి విచిత్రంగా ఉంది.

భారత్ లో పెట్టుబడులు పెడితే ఇక ఆ డబ్బు మిగిలే ప్రసక్తే లేదు అని చాలా మంది వాపోవడం విశేషం. రియల్ ఎస్టేట్ రంగం మోసాలకి పుట్టినిల్లు లాగా మారుతోంది. ఇప్పటికే చాలా మంది ఈ రంగం లో పెట్టుబడులు పెట్టి భారీగా మోసపోవడం తో కొత్తగా పెట్టేవారు చాలా జాగ్రత్తగా ప్రవర్తిస్తున్నారు. ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ చేసిన పనికి ఇప్పుడు భారత్ లో డబ్బు పెట్టడమే వేస్ట్ అనే పరిస్థితి కి ఎన్నారై లు చేరిపోయారు. గుర్గావ్ కి చెందిన స్పైర్ ఎడ్జ్ ఆఫ్ ఏఎన్ బిల్డ్‌వెల్ రియల్ ఎస్టేట్ కంపెనీ తమ కంపెనీలో పెట్టుబడులు పెడితే తక్కవ సమయంలో రెట్టింపు ఆదాయం వస్తుందని ప్రవాస భారతీయులను ఆకట్టుకునేలా ప్రచారం చేపట్టింది.

ఇది గమనించిన ఎన్నారైలు తమ దగ్గర దాచుకున్న డబ్బుని అందులో పెట్టారు ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు 600 మంది ఎన్నారై లు ఇలా డబ్బులు పెట్టి మోసపోయారు. అమెరికా కి చెందిన ప్రవాస భారతీయ వ్యాపారి వీరేంద్ర జైన్ 2010 లోనే గుర్గావ్ కి చెందిన ఈ కంపెనీ లో అరవై లక్షలు పెట్టారు. ఆ కంపెనీ లో డబ్బులు పెడితే రెట్టింపు డబల్ అవుతుంది అని వారు మాట ఇవ్వడం తో పెట్టాను అనీ ఇప్పటి వరకూ అసలు తో సహా మొత్తం మీద కనీస రాబడి లేదు అని ఆయన అంటున్నారు.

 

" మా దేశం లో మమ్మల్నే మోసం చేసారు " :

 

" భారత్ మా సొంత దేశం అయినా కూడా అక్కడికి వెళ్ళాలి అంటే ఈ సంఘటన తరవాత భయమేస్తోంది. మా సొంత దేశం లో మేము ఇంతగా మోసపోతాం అని ఎప్పుడూ అనుకోలేదు. నాకు నాతో పాటు ఒక 550 మందికి జరిగిన అన్యాయాన్ని ప్రధాని కార్యాలయం, హర్యానా ముఖ్యమంత్రి కార్యాలయం ఇలా చాలా మందికి ఫిర్యాదు రూపం లో తెలిపాను కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. ఒక పక్క మోడీ మాత్రం విదేశీ పెట్టుబడులు కోరుతున్నారు , ఇలాగైతే ఎవరు పెట్టాలని అనుకుంటారు ? " అని ఆయన వాపోతున్నారు. దాదాపు ఆరొందల మందిని మోసం చేసిన ఈ కంపెనీ మీద త్వరగా యాక్షన్ తీసుకోవాలి అని వారు కోరుతున్నారు. ఏదైనా తేడా వస్తే ఎన్నారైల విశ్వాసాన్ని భారత ఇన్వెస్టింగ్ కంపెనీలు కోల్పోతాయి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: