జీవితంలో మనిషికి ఎన్నో సాధించాలని..అందమైన జీవితాన్ని గడపాలని తన కన్నవారి కలలు నెర్చాలని యువత ఎప్పుడూ ఆశపడుతుంటారు. అయితే భారత దేశం నుంచి ఉన్నత చదువుల కోసం, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లడం తెలిసిన విషయమే. అయితే అందమైన వారి ఆనందంలో విషాదం చోటు చేసుకుంటే వారిని కన్నవారు ఎంత దుఖఃసాగరంలో మునిగిపోతారు తెలియదు. కళ్ల ఎదుట ఉండే తమ పిల్లలు ఎక్కడో ఒంటరిగా జీవిస్తూ సంతోషంగా ఉన్నారులే అనుకున్న సమయంలో ఒక్కసారిగా ఆ పిల్లలు మృత్యువు భారిన పడిన సమాచారం వింటే తల్లడిల్లిపోతారు.

తాజాగా అమెరికాలో ఉద్యోగం కోసం వెళ్లిన యువకుడు తిరిగిరాని లోకాలకు వెళ్లాడని వార్త తెలుసుకున్న ఆ తల్లిదండ్రుల ఆక్రందన మిన్నంటిపోతుంది.  నాలుగేళ్ల క్రితం యూఎస్ వెళ్ళిన హైదరాబాద్ వాసి నంబూరి శ్రీదత్త (25) ఎంఎస్ పూర్తి చేసి ఇటీవలే ఉద్యోగంలో చేరాడు.

ఆదివారం తన ఫ్రెండ్స్‌తో కలిసి ఓహియో దగ్గరి వాటర్ ఫాల్ చూసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తూ అక్కడి లోయలో పడి ప్రాణాలు కోల్పోయాడు. తాను మూడు నెలల్లో ఇంటికి వస్తానని తల్లికి చెప్పిన శ్రీదత్త ఇలా అర్ధంతరంగా మరణించడంతో వనస్థలిపురంలోని అతని కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఇది ఇలా ఉండగా ఇక కృష్ణా జిల్లా బండిపాలెం గ్రామానికి చెందిన పుట్ట నరేష్ అనే యువకుడు ఎంఎస్ చేయడానికి వెళ్లాడు.

తన స్నేహితులతో డెట్‌వ్యాలీ పార్క్ సరస్సులో ఈతకోసం వెల్లి గల్లంతైన విషయం తెలిసిందే..అయితే అతని మృతదేహాన్ని  మంగళవారం కనుగొన్నారు.జిల్లా బండిపాలెం గ్రామానికి చెందిన నరేష్ తన తండ్రికి ఉన్న రెండెకరాల భూమిని తాకట్టు పెట్టి నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీలో ఎమ్ఎస్ చదివేందుకు వచ్చాడని తెలిసింది. పుట్ట నరేష్ మృతితో  అతని కుటుంబం విషాదంలో మునిగిపోయింది.




మరింత సమాచారం తెలుసుకోండి: