అమెరికాలో తెలుగు యువకుడు చేసిన విన్యాసం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.  న్యూజెర్సీలో తెలంగాణ యువకుడు విలాస్‌రెడ్డి అద్భుతమైన విన్యాసం చేసి చూపరులను ఆకట్టుకున్నాడు.  14,500 అడుగుల ఎత్తు నుంచి స్కై డైవింగ్‌ చేశారు.  సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత ప్రధానమంత్రి మోడీ తొలిసారిగా తెలంగాణకు రావడం ఎంతో సంతోషమని అంతే కాకుండా స్వాతంత్య్ర వేడుకలకు భారత్ సిద్ధమవుతున్న నేపథ్యంలో మోదీ చిత్రం ఉన్న టీ షర్ట్‌ వేసుకుని ఈ విన్యాసం చేశారు.  

ఇక తెలంగాణలో రైతులందరికీ తన మద్దతు తెల్పుతూ ఈ సాహసం చేస్తున్నట్లు విలాస్ రెడ్డి చెప్పారు. ఇక భారత సంతతికి చెందినవారు అమెరికాలో తెలంగాణ  ఐక్యత చాటుతు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నవిషయం తెలిసిందే. ఈ మద్య ఆటా ప్రోగ్రామ్ కూడా నిర్వహించారు. న్యూజెర్సీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తూ...అక్కడే స్థిరపడినప్పటికీ మాతృదేశంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఆకాశంలో 14,500 అడుగుల ఎత్తులో విమానం నుంచి దూకడం ఓ సాహస విన్యాసం. రెండు నిముషాల పాటు అంత ఎత్తున ఫ్రీ ఫాల్‌ స్థితిలో ఉండి జై తెలంగాణ, వందేమాతరం, భారత మాతాకీ జై నినాదాలతో హోరెత్తించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: