అమెరికాలో మన భారతీయులు సంస్కృతీ సాంప్రదాయాలకు మంచి విలువ ఇస్తారు.   బిజీ లైఫ్ గడుపుతున్నా వీక్ ఎండ్ లో మాత్రం తెలుగు వారంతా ఒక్కటై చక్కని ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ ఆనందం పొందుతారు. ఇక అమెరికాలో తెలంగాణ పీపుల్స్ అసోసియేష‌న్ ఆఫ్ డాల‌స్(టీపీఏడీ)  ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఇక్కడ బతుకమ్మ పండుగ చాలా ఘనంగా నిర్వహిస్తుంటారు. తాజాగా డాలస్ లో టీపీఏడీ ఆధ్వర్యంలో  తుక‌మ్మ‌-ద‌స‌రా ఉత్స‌వాల సంద‌ర్భంగా సంద‌డి మొద‌లైంది.

 ఈ ఉత్సవాలు అత్యంగ వైభవంగా చేయబోతున్నట్లు తెలంగాన సంస్కృతీ సాంప్రదాయాలకు అద్దం పట్టేలా అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వ్యవస్థాపకులు..నిర్వహకులు అంటున్నారు.  మహిళలు, పిల్లలు చక్కగా  సాంప్రదాయ బద్దంగా చీరలు కట్టుకొని సాంప్రదాయ బద్దంగా బతుకమ్మ ఆడుతారని అన్నారు. అక్టోబ‌రు 8న మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి అర్ధ‌రాత్రి వ‌ర‌కు అక్క‌డి డాక్ట‌ర్ పెప్ప‌ర్ ఎరీనా మైదానంలో నిర్వ‌హించ‌నున్న ఈ సంబ‌రాల కోసం ఏర్పాట్లు మొద‌ల‌య్యాయి.

వేడుక‌లకు హాజ‌ర‌య్యే కుటుంబాల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 10 వేల మంది పాల్గొంటార‌ని అంచ‌నా వేస్తున్నారు. సంబ‌రాల‌కు స‌న్నాహ‌కంగా ఏర్పాటు చేసిన విందుకు 400  టీపీఏడీ నిర్వ‌హించిన ఈ కార్య‌క్ర‌మం ఆద్యంతం ఉల్లాస‌భ‌రితంగా సాగింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: