విదేశాల్లో స్థిరపడినా సొంతవూరిపై మమకారంతో తమ ప్రజల మేలు కొరుతూ అనేకమంది ఎన్నారైలు గ్రామాభివృద్ధికి తోడ్పడుతున్నారు. వీరిలో నల్గొండ జిల్లా సుంకిశాలకు చెందిన ఎన్నారై డాక్టర్‌ పైళ్ల మల్లారెడ్డి ముందు వరసలో ఉంటారు.ఆయన తన సొంతగ్రామంతో పాటు వలిగొండలోనూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. మద్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆయన అమెరికాలో రెండు ఔషధ కంపెనీలను నెలకొల్పారు. 



పురిటిగడ్డకు మేలు చేయాలనే తలంపుతో 1996లో శ్రీవెంకటేశ్వర సాంఘిక సంక్షేమ సేవా సమితి ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. గ్రామానికే పరిమితం గాకుండా మండల వ్యాప్తంగా సేవా కార్యక్రమాల్ని విస్తరించారు. సుంకిశాలలోనే దాదాపు రూ.3 కోట్ల నిధులతో ఆలయాల సముదాయాన్ని, పులిగిల్ల, సుంకిశాలలో చెరువుల అభివృద్ధికి రూ.50 లక్షలు, సిమెంటు రోడ్ల ఏర్పాటుకు రూ.45 లక్షలు, వలిగొండలో ప్రభుత్వ కార్యాలయాల సముదాయానికి స్థల కేటాయింపు,



వలిగొండలో రూ.1.20 కోట్ల వ్యయంతో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల భవన నిర్మాణం, రూ.2.50 కోట్లతో కళాశాల భవన నిర్మాణం చేపట్టారు. అందుకే భారత ప్రభుత్వం ఆయన సేవా కార్యక్రమాలను గుర్తించి దశాబ్ధం కిందటే ‘నేషనల్‌ సిటిజన్‌షిప్‌’ అవార్డును ప్రధానోత్సవం చేసింది. రాజకీయాలకతీతంగా ప్రజలు ముందుకు వస్తే అభివృద్ధి వేగవంతం అవుతుంది. గ్రామాన్ని మోడల్‌ విలేజ్‌గా మార్చాలని ఉంది. గ్రామస్తులు ఐక్యతతో ఉంటే సాధించవచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి: