అమెరికాలోని అట్లాంటా నగరంలో శ్రీ కృష్ణవిలాస్‌లో అట్లాంటా తెలుగు సంఘం( తామా), ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) వారి ఆధ్వర్యంలో సీపీఆర్‌ తరగతులు నిర్వహించారు. హృదయ సంబంధమైన వ్యాధులతో బాధపడేవారికి అత్యవసర పరిస్థితుల్లో ఎలా సాయం చేయాలో చెప్పడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమానికి సుమారు 50కిపైగా ప్రవాసులు హాజరయ్యారు.



కార్యక్రమాన్ని తామా బోర్డు డైరెక్టరు ముద్దాళి సుబ్బారావు స్వాగతోపాన్యాసంతో ప్రారంభించారు. తానా దక్షిణతూర్పు సమన్వయకర్త అనిల్‌ యలమంచలి ‘తానాకేర్స్‌’ కార్యక్రమాలను వివరించారు. అమెరికాలో ఉన్న తెలుగు వారందరి అవసరాలు తీర్చడం కోసం తానాసంఘం వారు చేపట్టిన సరికొత్త కార్యక్రమమే ఈ ‘తానాకేర్స్‌’. ఇందులో భాగంగా ఆరోగ్య విద్య, సేవ తదితర విభాగాల్లో శిక్షణనిస్తారు.



శిక్షణ శిబిరానికి కావాల్సిన సదుపాయాలు చేకూర్చిన వెన్సాయ్‌ ఫౌండేషన్‌ అధినేత నిమ్మగడ్డ శ్రీనివాస్‌ను తానాకేర్స్‌ సభ్యులు ఈ సందర్భంగా సత్కరించారు. ట్రస్ట్‌హోం కేర్‌ అధినేత రహీమ్‌ హుస్సేన్‌ శిక్షణ తరగతులను నిర్వహించి, వూపిరి, ఏఈడీ నిర్వహణ, పిల్లలు-పెద్దలు, అనే అంశాలను క్లుప్తంగా వివరించారు. అనంతరం తానాకేర్స్‌ సభ్యులు ఉపేంద్ర నర్రా, తామా అధ్యక్షులు వెంకట్మీసాల తదితరులు రహీం హుస్సేన్‌ను సత్కరించారు. తామా బోర్డు కార్యదర్శి మహేష్‌ పవార్‌ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: