బే ఏరియా తెలుగు అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పద్మ భూషణ్‌ ఇళయరాజా నిర్వహించిన సంగీత విభావరి ప్రేక్షకులను అలరించింది. కాలిఫోర్నియాలోని శాన్‌హెసెలో జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపు 5000 మందికి పైగా అభిమానులు పాల్గొన్నారు. తెలుగు పాటలతో నిర్వహించిన కార్యక్రమం ఆద్యంతం వీక్షకులను అలరించింది. ఇళయరాజా రాకతో, ఆయన నిర్వహించిన సంగీత కార్యక్రమంతో పులకించిపోయిన బే ఏరియా ప్రజలు ఆయనకు ‘సంగీత కళా సార్వభౌమ’ బిరుదుతో సత్కరించి ఆయన పై తమకు ఉన్న గౌరవాభిమానాన్ని చాటుకున్నారు.



బే ఏరియా తెలుగు అసోసియేషన్‌(బాటా), స్వాగత్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, యు స్మైల్‌ డెంటల్‌ నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్వాగత్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తరపున జయరామ్‌ కోమటి, బాటా తరపున విజయ ఆసూరి, లావణ్య దువ్వి, డా.మూర్తి ఉప్పల సంయుక్తంగా అందరికీ స్వాగతం పలికారు. ప్రముఖ నటుడు ప్రకాష్‌ రాజ్‌ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యతగా వ్యవహారించడం మరో విశేషం. ఇళయరాజాను ఆయన ‘సర్‌’ పేరుతో వేదిక పైకి సగౌరవంగా ఆహ్వానించినప్పుడు థియేటర్‌ కరతాళధ్వనులతో మార్మోగింది.



ఇళయరాజా సంప్రదాయవేషధారణతో స్టేజి పైకి వచ్చినప్పుడు అందరూ లేచి నిలబడి ఆయనను ఘనంగా స్వాగతించారు. ‘జననీ జననీ’ పాటను ఇళయరాజా ఆలపించారు. చిన్న కుయిల్‌ కె.ఎస్‌.చిత్ర, కార్తీక్‌, మనో, సాధన సర్గం, ప్రియ, అనిత, రమ్య తదితరులు ఇళయరాజా ఆధ్వర్యంలో పాడిన పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. మూవర్స్‌ డాట్‌కామ్‌ ఈ కార్యక్రమాన్ని ప్రజెంట్‌ చేస్తే, సయ్యద్‌ అహ్మద్‌ (ఇంటెరో), త్రినేత్ర, పిస్తా హౌజ్‌ ప్లాటినం స్పాన్సర్‌లుగా, విభ, మై ట్యాక్స్‌ పైలర్‌, సత్య దాసరి, కావిరన్‌, పీకాక్‌ ఇండియన్‌ రెస్టారెంట్‌, ఎపెక్స్‌ కన్సల్టింగ్‌, గోల్డ్‌ స్పాన్సర్‌లుగా పిఎన్‌జి జ్యూవెల్లర్స్‌, ఐ బ్రిడ్జ్‌ సిల్వర్‌ స్పాన్సర్లుగా వ్యవహరించాయి. విరిజల్లు రేడియో, దేశీ 1170 ఎఎం, 92.3 ఎఫ్‌ఎం రేడియో పార్టనర్‌లుగా ఉన్నాయి. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధప్రసాద్‌, శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఇండియన్‌ కాన్సుల్‌ జనరల్‌ వెంకటేషన్‌, అశోక్‌ ప్రముఖ నటులు ప్రకాష్‌రాజ్‌, నారా రోహిత్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.



బాటా ఎగ్జిక్యూటివ్‌ కమిటీ శిరీష బత్తుల (ప్రెసిడెంట్‌), యశ్వంత్‌ కుదరవల్లి ( వైస్‌ ప్రెసిడెంట్‌), సుమంత్‌ పుసులూరి (సెక్రటరీ), హరినాథ్‌ చికోటి (ట్రెజరర్‌), శ్రీకర్‌ బొద్దు( జాయింట్‌ సెక్రటరీ), కల్చరల్‌ కమిటీ సభ్యులు శ్రీదేవి పసుపులేటి, శ్రీలు వెలిగేటి, దీప్తి సత్తి, లాజిస్టిక్‌ కమిటీ సభ్యులు కొండల్‌ కొమరగిరి, అరుణ్‌రెడ్డి, ప్రశాంత్‌ చింత, నరేష్‌ గాజుల, స్టీరింగ్‌ కమిటీ సభ్యులు రవి తిరువీధుల, కామేష్‌ మల, కల్యాణ్‌ కట్టమూరి, అడ్వయిజరీ బోర్డు సభ్యులు జయరామ్‌ కోమటి, విజయ అసూరి, వీరు ఉప్పల, ప్రసాద్‌ మంగిన, రమేష్‌ కొండ, కరుణ్‌ వెలిగేటి తదితరులు కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: