తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరం(టీడీఎఫ్‌) ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. కెనడాలోని టొరంటో (మిస్సిసౌగ) నగరంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ప్రవాస తెలంగాణ వాసులు భారీగా తరలివచ్చారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా నిర్వహించిన ఆటా, పాటా అందరినీ ఎంతో అలరించింది. మహిళలు రంగు రంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఆడి పాడారు. చిన్నారులకు పలు ఆటల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దలు చిన్నారులకు బతుకమ్మను గురించి వివరించారు. అనంతరం పసందైన తెలంగాణ సంప్రదాయ వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టీడీఎఫ్‌ సభ్యులు మాట్లాడుతూ.. ఏటా తెలంగాణ సంప్రదాయాలు ఉట్టిపడేలా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తామని, బతుకమ్మ సంబురాలు విజయవంతమయ్యేందుకు కృషి చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: