ఉత్తర అమెరికా తెలుగు సంఘం-నాట్స్‌ సంబరాలు ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఇందుకోసం నాట్స్‌ కార్యవర్గం సెప్టెంబర్‌ 25న చికాగోలో సమావేశమైంది. 2017 జూన్‌30 నుంచి చికాగోలో వరుసగా మూడు రోజులు నాట్స్‌ వేడుకలు నిర్వహించనున్నట్లు నాట్స్‌ బోర్డు ఆఫ్‌ డైరెక్టర్స్‌ కార్యదర్శి అప్పసాని శ్రీధర్‌ తెలిపారు. తెలుగు ప్రముఖులకు ఆహ్వానాలు, సినీతారలు, కళాకారులకు సంబంధించిన కార్యక్రమాలపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటెషన్‌ ద్వారా వివరించారు. సంబరాలకు అవసరమయిన నిధులను విరాళాల రూపంలో సేకరించాలని నిర్ణయం తీసుకున్నారు.



 ఈ సంబరాల్లో స్థానిక చికాగో తెలుగు సంఘానికి భాగస్వామ్యం కల్పించనున్నారు. చికాగో నాట్స్‌ తెలుగు సంబరాల సమన్వయకర్తగా రవి ఆచంటను నాట్స్‌ జాతీయ కార్యవర్గం ప్రకటించింది. మంచికలపూడి శ్రీనివాస్‌ ఫైనాన్సియల్‌ స్టేటస్‌ రిపోర్ట్‌ను సభలో వివరించారు. ఈ సందర్భంగా నాట్స్‌ ఛైర్మన్‌ మద్దాలి సామ్‌ నాట్స్‌ సంబరాల ఆవశ్యకతను వివరించారు. ఈ వేడుకలకు నాట్స్‌ జాతీయ కార్యవర్గం పూర్తి సహకారం అందిస్తుందని నాట్స్‌ జాతీయ అధ్యక్షుడు మన్నవ మోహన కృష్ణ తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో నాట్స్‌ చేపట్టాల్సిన సేవా కార్యక్రమాలు గురించి ఆలపాటి రవి సభ్యులకు వివరించారు. నాట్స్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్‌ పదవుల్లోకి కొత్తగా వాషింగ్టన్‌ నుంచి నాట్స్‌ చాప్టర్‌ సమన్వయకర్త లింగా మాణిక్య లక్ష్మీ, మోటూరు ప్రవీణ్‌, రామినేని ఫణి, ఆచంట చౌదరిలు నియమితులయ్యారు. సంబరాలకు మద్దతుగా అమెరికాలోని ప్రధాన నగారల్లో చేపట్టాల్సిన నిధుల సమీకరణ కార్యక్రమాలపై నాట్స్‌ బోర్డు చర్చించింది.



ఈ సమావేశంలో నాట్స్‌ జాతీయ కార్యవర్గం సభ్యులు కొత్త శేఖరం, డాక్టర్‌ కొడాలి శ్రీనివాసరావు, దేసు గంగాధర్‌, గుత్తికొండ శ్రీనివాస్‌, కంచర్ల కిశోర్‌, బోడపాటి మధు, మదాల రాజేంద్ర, చాగంటి రంజిత్‌, ఎర్రాప్రగడ సాయి ప్రభాకర్‌, సూరపనేని బసవేంద్ర, నూతలపాటి రమేశ్‌, వీరపనేని విష్ణు, మేడిచర్ల మురళీకృష్ణ, అల్లాడ రాజ్‌, మందాడి శ్రీహరి, కొమ్మినేని శ్రీనివాసరావు, కొత్తపల్లి కృష్ణ, బోడేపూడి కోటేశ్వరరావు, సీటీఏ నాయకులు వేగే నాగేంద్ర, మర్యాల రమేశ్‌, పాములపాటి మదన్‌, ఆచంట రావ్‌, మోటూరు ప్రవీణ్‌, రామినేని ఫణి, వెనిగళ్ల విజయ్‌, కొప్పాక మూర్తి, కాకార్ల మహేశ్‌, తాళ్లూరు ప్రసాద్‌, చుండు శ్రీనివాస్‌, గన్నే విజయ్‌ తదితరలు పాల్గొన్నారు. అనంతరం నూతలపాటి రమేశ్‌ అధ్యక్షతన ఎగ్జిక్యూటీవ్‌ కమిటీ సమావేశం జరిగింది.


మరింత సమాచారం తెలుసుకోండి: