అమెరికాలోని న్యూజెర్సీ సౌత్ ఫ్లైన్ఫీల్డ్లోని సాయి దత్తపీఠంలో బతుకమ్మ, దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నవరాత్రుల్లో భాగంగా తొమ్మిది రోజులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చండీ హోమం, లక్ష కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు భజనలు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.