ట్రంప్ మద్యపానం.. డ్రగ్స్‌కి దూరం. సోదరుడు వీటికి బానిసై చనిపోయాడు. అతన్ని చూసి ట్రంప్ ఈ అలవాట్ల జోలికి వెళ్లలేదు.నిద్రలేచిన వెంటనే ఇతను మొదట చేసేపని.. అద్దంలో చూసుకొని.. తలదువ్వుకోవడం. ట్రంప్‌కి షేక్ హ్యాండ్ ఇవ్వడం నచ్చదు. ట్రంప్ అధ్యక్షపదవికి పోటీలో మిగులుతాడని ఎవరూ అనుకోలేదు. అది వాస్తవం అయింది. ఆ వాస్తవం పీడకలగా మారకూడదని ఆశిద్దాం. ఎన్ని లోపాలున్నా అమెరికా సమాజం వివేకవంతమైనది. 2016 ఎన్నికలు అమెరికా పట్ల ఉన్న ఆ అభిప్రాయాన్ని మారుస్తుందనుకోవడం లేదు.