మానవదేహానికి రక్తం ఎలాగో, కంప్యూటర్‌కు కరెంటు ఎలాగో.. దేశ ఆర్థిక వ్యవస్థను నడిపించేందుకు చమురు అలాగే ఉపయోగపడుతుందని ఆర్థిక వేత్తలు చెబుతుంటారు. వారి మాటలను కొట్టిపారేయలేని పరిస్థితి నేడు ఉంది. నెలకోసారి చమురు ధరలు పెరుగుతోంటే సామాన్యుడి గుండె గుభిల్లుమంటోంది. లీటరు పెట్రోలు ధర ఎప్పుడు ఎంత ఉంటుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. అంతర్జాతియంగా చమురు ధరలు తగ్గాయిని వార్తలు వస్తున్నా.. మన దేశంలో ఆ మొత్తంలో లాభం ప్రజలకు చేరలేదు, చేరబోదు కూడా. రాజకీయాల సంగతి కాసేపు పక్కనపెడితే పెట్రోలు, డీజిల్ వంటి వాటి రేట్లతో ఏ బాధా లేని వారు ఎవరు..? ప్రపంచంలో అతి తక్కువ పెట్రోల్ రేటు ఉండే దేశాలేవి..? ఇక్కడ 75 రూపాయలు పెడితే కానీ లీటరు పెట్రోలు రావట్లేదు.. అలాంటిది రూపాయల్లోనే ఖర్చుపెడుతూ ఏ దేశ ప్రజలు పెట్రోల్‌ను చవకగా కొంటున్నారు...? అనే విషయాలు అందరికీ ఆసక్తికరమే.. అందుకే ప్రపంచంలో అత్యంత తక్కువ ధరకు పెట్రోల్‌ను అమ్మే టాప్-10 దేశాల వివరాలు మీకోసం.. 


 
1. వెనిజువెలా
లీటరు పెట్రోల్ ధర: 0.02 డాలర్లు (1.36 రూపాయలు)
 
2. సిరియా
లీటర్ పెట్రోల్ ధర: 0.05 డాలర్లు (3.41 రూపాయలు)
 
3. లిబియా
లీటర్ పెట్రోల్ ధర: 0.12 డాలర్లు (8.18 రూపాయలు)
 
4. సౌదీ అరేబియా
లీటర్ పెట్రోల్ ధర: 0.15 డాలర్లు (10.22 రూపాయలు)
 
5. టర్క్‌మెనిస్తాన్
లీటర్ పెట్రోల్ ధర: 0.21 డాలర్లు (14.30 రూపాయలు)
 
6. కువైట్
లీటర్ పెట్రోల్ ధర: 0.22 డాలర్లు (14.98 రూపాయలు)
 
7. ఇరాన్
లీటర్ పెట్రోల్ ధర: 0.24 డాలర్లు (16.35 రూపాయలు)
 
8. బహ్రెయిన్
లీటర్ పెట్రోల్ ధర: 0.25 డాలర్లు (17.03 రూపాయలు)
 
9. ఖతర్
లీటర్ పెట్రోల్ ధర: 0.25 డాలర్లు (17.03 రూపాయలు)

10. అల్జీరియా

లీటర్ పెట్రోల్ ధర: 0.25 డాలర్లు (17.03 రూపాయలు)
వెనిజువెలాలో 70 లీటర్ల పెట్రోల్‌తో కారును ఫుల్‌ట్యాంక్ చేయించాలంటే కేవలం 95 రూపాయలు మాత్రమే సరిపోతాయి. అదే భారత్‌లో అయితే 5250 రూపాయలు ఖర్చవుతాయి. కాగా ఈ దేశాల్లో చమురు ప్రధానంగా వ్యాపారం జరుగుతుంటుంది. సౌదీ, కువైట్, బహ్రెయిన్, ఖతర్ వంటి గల్ఫ్ దేశాలు కూడా ఈ లిస్ట్‌లో ఉండటం గమనార్హం. 


మరింత సమాచారం తెలుసుకోండి: