హెచ్‌1బీ వీసా మోసం కేసులో భారత సంతతి మహిళ హిరల్‌ పటేల్ తన నేరాన్ని అంగీకరించింది. ఈ కేసులో ఆమెకు జూన్‌ నుంచి ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ. కోటి 67 లక్షల జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. జెర్సీ సిటీకి చెందిన హిరల్‌ పటేల్‌(34) అమెరికాలోని రెండు ఐటీ కంపెనీలకు(ఎస్‌సీఎమ్‌ డేటా అండ్‌ ఎమ్‌ఎన్‌సీ సిస్టమ్స్‌) హెచ్‌ఆర్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.

నేరం ఒప్పుకున్న ఎన్నారై మహిళ
ఈ కంపెనీలు విదేశీయులను, విద్యార్థి వీసా కలిగినవారిని, పట్టభద్రలైనవారిని హెచ్‌1బీ వీసా ప్రోగ్రామ్‌ కింద రిక్రూట్‌ చేసుకునే క్రమంలో నిబంధనలను ఉల్లంఘించాయి. పూర్తిస్థాయి ఉద్యోగం కల్పించకుండా, సమాఖ్య నియమాల ప్రకారం జీతాలు చెల్లించకుండా మోసాలకు పాల్పడ్డాయి. ఈ నేపథ్యంలో న్యూయార్క్‌ ఫెడరల్‌ కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా న్యాయమూర్తి కెవిన్‌ మెక్‌నల్టీ ముందు హిరల్‌ పటేల్‌ తన నేరాన్ని అంగీకరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: