అమెరికాలోని అట్లాంటా నగరంలో తెలంగాణ జాగృతి అమెరికా విభాగం వారి ఆధ్వర్యంలో ఫుడ్‌డ్రైవ్‌ ఛారిటీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి జాగృతి అమెరికా శాఖ అధ్యక్షుడు శ్రీధర్‌ బండారు, కార్యనిర్వాహణ కార్యదర్శి మురళి బొమ్మనవేని, అట్లాంటా విభాగం అధ్యక్షుడు చంద్రశేఖర్‌ పళ్ల హాజరై కార్యక్రమ వివరాలను సభికులకు వివరించారు. ప్రతి ఆరు నెలలకు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు రక్తదానం, పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ... తదితర కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించారు.



సమావేశంలో స్థానిక తెలుగు సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ఆటా తరఫున కరుణాకర్‌ ఆసిరెడ్డి, అనిల్‌ బొదిరెడ్డి, తిరుమల్‌ పిట్ట, రఘ బండ, టాటా తరఫున గౌతమ్‌ గోలి, భారత్‌ మదాడి, శ్రీనివాస్‌ ఆవుల, గేట్స్‌ నుంచి సునీల్‌ కూతురు, ‘గత’ తరపున సత్యనారాయణరెడ్డి... తదితరులు పాల్గొన్నారు. వలంటీర్లు సునీల్‌ తాళపల్లి, రణధీర్‌ కనాథాల, ప్రభాకర్‌ మడుపతి, మధుకర్‌ నంబేటి, శివ పాటిల్‌, సుశీల్‌, మాధవ్‌ కూసం, రఘు గాండ్ర, ప్రేమ్‌, కిషన్‌, సుభాష్‌ అమిరెడ్డి, శ్రీధర్‌ చోడవరపు, సుజయ్‌, జనార్ధన్‌ పన్నెల, సత్య లక్కిరెడ్డిలకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: