సరైన పత్రాలు లేని లక్షలాది మంది వలసదారులను అమెరికా నుంచి బహిష్కరించేందుకు అవసరమైన క్షేత్రస్థాయి కార్యక్రమాలను ట్రంప్ ప్రకటించారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేశారు. ఫెడరల్ ఇమిగ్రేషన్ చట్టాలను అమలు చేసేందుకు పరిథిని పెంచారు. హోం లాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన మెమోలో ‘‘దేశం నుంచి పంపించవలసిన విదేశీయులకు చట్టం అమలు నుంచి మినహాయింపులను డిపార్ట్‌మెంట్ అనుమతించదు’’ అని పేర్కొంది. విదేశీయుడు ఇమిగ్రేషన్ చట్టాలను ఉల్లంఘించినట్లు ఇమిగ్రేషన్ ఆఫీసర్ నమ్మేందుకు కారణం కనిపిస్తే, ఆ విదేశీయుడిని అరెస్టు చేసేందుకు లేదా నిర్బంధించేందుకు డిపార్ట్‌మెంట్ సిబ్బందికి సంపూర్ణ అధికారాలు ఉన్నాయని పేర్కొంది.



అక్రమ వలసదారులను దేశం నుంచి బహిష్కరించేందుకు నిబంధనలను కఠినతరం చేస్తూ రెండు ఎన్‌ఫోర్స్‌మెంట్ మెమోలను హోం లాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ జారీ చేసింది. అయితే, ఒంటరి మైనర్లు, ఆశ్రయం కోసం దరఖాస్తు చేసే ఉద్దేశం ఉన్నవారు, తమ స్వదేశాల్లో హింస లేదా అణచివేత ఉంటుందని భయపడేవారు, చట్టబద్ధమైన ఇమిగ్రేషన్ స్టేటస్ ఉన్నట్లు తెలిపేవారు ఈ చర్యల నుంచి తప్పించుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: