అమెరికాలో జాతివివక్షకు బలైన తెలుగు వ్యక్తి శ్రీనివాస్‌ కూచిబొట్ల కుటుంబానికి ఎన్‌ఆర్‌ఐలు అండగా నిలిచారు. 'గోఫండ్‌మీ' వెబ్‌సైట్‌ ద్వారా బాధితుడి కుటుంబానికి ఎన్‌ఆర్‌ఐలు అండగా నిలిచారు. మరణించిన శ్రీనివాస్‌ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసేందుకు వేలాది మంది ముందుకు వచ్చారు. గతంలో శ్రీనివాస్‌తో కలిసి పనిచేసిన కవిప్రియ ముతురామలింగం శ్రీనివాస్‌ కుటుంబం కోసం విరాళాలు ఇవ్వాలని కోరుతూ గోఫండ్‌మి పేజీ రూపొందించారు. దీనికి విశేష స్పందన లభించింది. 


శ్రీనివాస్‌ కుటుంబానికి ఎన్‌ఆర్‌ఐల బాసట

శ్రీనివాస్‌ కుటుంబానికి సుమారు 2 లక్షల డాలర్లు 'గోఫండ్‌మీ' ద్వారా విరాళాలు అందించారు. శ్రీనివాస్‌ కుటుంబానికి అండగా ఉంటామని అతడు పనిచేసిన గార్నిమ్‌ కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది. గోఫండ్‌మీ పేజీ ద్వారా వచ్చిన డబ్బు అంతా శ్రీనివాస్‌ భార్య సునయనకు అందజేయనున్నట్లు తెలిపారు. అమెరికా నుంచి ఆయన మృతదేహాన్ని భారత్‌కు పంపించడానికి ఆయన కుటుంబం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఈ డబ్బు ఉపయోగించనున్నట్లు చెప్పారు.



కన్సాస్‌ రాష్ట్రం ఒలాతేలో బుధవారం రాత్రి ఓ బార్‌లో శ్రీనివాస్‌తో పాటు.. అలోక్‌ మదసానిపై తెల్లజాతి దుండగుడు కాల్పులకు పాల్పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అలోక్‌ తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: