అమెరికాలో జాత్యహంకార దాడులు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి అధ్యక్ష నివాసమైన వైట్‌హౌస్‌ ఎదుట పలువురు ఇండో అమెరికన్లు ఆందోళన చేపట్టారు. భారత సంతతికి చెందినవారు ముఖ్యంగా హిందువులు, సిక్కులు అమెరికాలో విద్వేషపూరిత దాడులకు బలవుతున్న నేపథ్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జోక్యం చేసుకోవాలని డిమాండ్‌ చేస్తూ వైట్‌హౌస్‌ ఎదుట అవగాహన ర్యాలీ చేశారు.



అమెరికాలో విద్వేషానికి హిందువులు ఎక్కువగా బాధితులవుతున్నారని వర్జీనియాకు చెందిన న్యాయవాది వింద్య అడపా అన్నారు. విద్వేషపూరిత నేరాలకు వ్యతిరేకంగా అవగాహన ర్యాలీ చేపట్టినట్లు తెలిపారు. ఇది ట్రంప్‌ యంత్రాగానికి వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళన కాదని, విద్వేషనేరాలకు వ్యతిరేకంగా తమకు ట్రంప్‌ యంత్రాంగం మద్దతివ్వాలని కోరుతున్నామని ఆమె పేర్కొన్నారు. అధ్యక్షుడు ఇలాంటి ఘటనలను తీవ్రంగా ఖండించాలని కోరుతున్నట్లు చెప్పారు. హిందువులు, సిక్కులను మద్యప్రాచ్యదేశాలకు చెందినవారిగా పొరపడుతున్నారన్నారు. విద్వేష నేరాలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ వారు వినతిపత్రం సమర్పించారు.

Facebook ShareTwitter ShareGoogle Share



మరింత సమాచారం తెలుసుకోండి: