నవ్యాంధ్ర రాజధాని అమరావతి వేదికగా మొదటిసారి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో నివసిస్తున్న తెలుగువారు సంబరాలు జరుపుకొన్నారు. నవ్యాంధ్ర తెలుగు అసోసియేషన్‌ (నాటా) ఆధ్వర్యంలో సిడ్నీలోని పారమట్ట పార్కులో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో తెలుగు కుటుంబాలుఉత్సాహంగా పాల్గొన్నాయి.



ముఖ్య అతిథిగా హాజరైన సిడ్నీ యూనివర్శిటీ సీనియర్‌ ప్రొఫెసర్‌, అపెక్స్‌ డెంటల్‌ సెంటర్‌ వైద్యుడు ఘంటసాల మహేశ్‌ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం నాటా ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలు, లక్ష్యాలు, తదితర అంశాలను ఆ సంఘం ఉపాధ్యక్షుడు గొల్లవిల్లి సూర్య వివరించారు. సిడ్నీలో నివసించే తెలుగువారికి నాటా కచ్చితంగా సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. సిడ్నీలోని తెలుగువారంతా కలిసి మెలిసి ఉండాలని కోడూరి శ్యాంప్రసాద్‌, పెరవలి రాజు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతుల్ని ఎంతగానో అలరించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: