అగ్రరాజ్యం అమెరికాకు డ్రాగన్ దేశం చైనా హెచ్చరికలు జారీ చేసింది. అమెరికాకు చెందిన అమెరికన్ బీ-1 బాంబర్ అనే యుద్ధవిమానం దక్షిణకొరియా సరిహద్దు దాటి తమ గగనతలానికి సమీపం నుంచి ప్రయాణించిందని చైనా ఆరోపించింది. జెజు ద్వీపానికి 70 నాటికన్ మైళ్ల దూరం నుంచి బాంబర్ విమానం ప్రయాణించడాన్ని చైనీస్ ఎయిర్ ట్రాఫిక్ అధికారులు గుర్తించారని, బాంబర్‌ విమానంలోని పైలెట్లతో అధికారులు మాట్లాడారని తెలిపింది.



ఎప్పటిలాగానే అంతర్జాతీయ గగన తలంపై ప్రయాణిస్తున్నామని, చైనా విమాన మార్గంపై ప్రయాణించడంలేదని పైలెట్లు తెలిపారని చైనా పేర్కొంది. విమానం ప్రయాణించిన ప్రాంతం చైనా గగనతల భద్రతా పరిధిలోకి వస్తుందని, ఈ ప్రాంతం నుంచి బాంబర్‌ని ఉపయోగించడాన్ని సహించబోమని అమెరికాకు చైనా స్పష్టం చేసింది. ఈ ఆరోపణలను అమెరికా, జపాన్ అధికారులు కొట్టిపారేశారు. చైనా ఆరోపణలు అవాస్తవమని ఖండించారు. వివాదాస్పదంగా పేర్కొంటున్న ఈ గగనతలం చైనా పశ్చిమ సముద్ర పరిధిలోకి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: