ఇథియోపియాకు చెందిన మహిళ దుబాయ్‌లో కేఫ్ నడుపుతోంది. ఆమె కేఫ్‌కి కాఫీ తాగేందుకు వచ్చిన ఒక కస్టమర్ కాఫీ తాగిన తర్వాత తన పర్సు, మొబైల్‌ఫోన్‌ను అక్కడే మరిచి వెళ్లిపోయాడు. కొద్దిదూరం వెళ్లిన తర్వాత అతడికి తన పర్సు లేదనే విషయం తెలిసింది. దాంతో అతడు కేఫ్‌కి వచ్చాడు. అతడు కూర్చున్న టేబుల్ దగ్గరికి వెళ్లి చూశాడు. అయితే అక్కడ పర్సు, మొబైల్ కనిపించలేదు. కేఫ్ యజమానురాలిని వాటి గురించి ప్రశ్నించాడు. కానీ, వాటిని తాను చూడలేదని చెప్పింది.



కేఫ్‌లో పనిచేస్తున్న వెయిటర్ మాత్రం పర్సు, మొబైల్ ఆమె వద్దే ఉన్నాయని చెప్పాడు. అతడు మళ్లీ ఆమె ప్రశ్నించాడు. కానీ, అదే సమాధానం చెప్పింది. దాంతో అతడు ఆమెతో వాగ్వాదానికి దిగాడు.ఆమె, అతడిని బూతులు తిట్టింది.  దాంతో చేసేదేమి లేక అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులతో కూడా ఆమె అలాగే ప్రవర్తించింది. ఇది తన స్థలం అని అక్కడినుంచి వెళ్లిపోవాలని ఆమె పోలీసులను దుర్భాషలాడింది.  దాంతో తమ విధులకు ఆటంకం కలిగిస్తోందని పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: