యూ ఎస్ లో విద్వేషా హత్యల నేపధ్యం లో తెలుగు వారి సేఫ్టీ గురించి ఇక్కడ మనవారికి విపరీతమైన అనుమానాలు ఏర్పడ్డాయి. ఉద్యోగాల కోసం ఆక్కడ ఉంటున్న తెలుగువారి పరిస్థితి ఎలా ఉంటుందో అంటూ వారి బంధువులు ఇక్కడ భయ పడుతూనే ఉన్నారు. తాజాగా యూఎస్ లో తెలుగు తల్లీ కొడుకుల హత్య కేసు రకరకాల ట్విస్ట్ లు తీసుకుంటోంది. ఇది విద్వేష హత్య కాదు అని అమెరికన్ పోలీసులు గట్టిగా చెబుతున్నారు.. సో పర్సనల్ లెవెల్ లోనే ఈ హత్య జరిగి ఉంది అని చెప్పచ్చు. ఒక పక్క చనిపోయిన లేడీ తల్లి తండ్రులు తమ అల్లుడే ఆమెని చంపేసాడు అనీ కూతురు తో పాటు మనవడిని కూడా తాము కోల్పోయాం అని వారు వాపోతున్నారు.


న్యూజెర్సీ లోని బర్లింగటన్ లో నివాసం ఉంటున్నారు శశికళ ఆమె తో పాటు కుమారుడు అనీష్ , ఆమె భర్త హనుమంతరావు ఉంటున్నారు. తాజాగా ఆమెని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి పీక మీద కట్టి పెట్టి కోసేసిన వైనం ఆమె భర్త పోలీసులకి చెబుతున్నాడు. ఈ ఉదంతం స్థానికంగా నే కాక అమెరికా మొత్తం పెద్ద సంచలనంగా మారింది. ఆ అనూహ్య వ్యక్తులు ఎవరు అనేది చేజింగ్ చేస్తున్న పోలీసులకి బాధితురాలి తల్లితండ్రులు షాక్ ఇచ్చారు. తమ అల్లుడి మీదనే తమకి అనుమానంగా ఉంది అనీ అతనే ఈ పని చేసి ఉంటాడు అని తాము అనుకుంటున్నాం అని వారు వాపోతున్నారు.


సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న హనుమంతరావు 12 సంవత్సరాల నుంచీ ఇదే దేశం లో ఉంటున్నాడు. నర్రా శశికళ కూడా ఉయోగం చేస్తున్నారు. వర్క్ ఫ్రొం హోం ఆప్షన్ తో కొన్ని రోజులుగా ఆమె ఇంట్లోనే ఉండి పని చేస్తున్నారు. అదే రోజు సాయంత్రం స్కూల్ కి వెళ్లి కొడుకుని ఇంటికి తీసుకొచ్చారు. సరిగ్గా సాయంత్రం ఏడుగంటల టైం లో తన భార్య నీ కుమారుడినీ హత్య చేసారు అంటూ హనుమంతరావు పోలీసులకి ఫిర్యాదు చేసాడు .


మరొక పక్క శశి తల్లితండ్రులు మాత్రం తమ కుమార్తెను.. మనమడ్ని ఎవరో హత్య చేసినట్లుగా చెబుతున్నతమ అల్లుడి కథనం ఉత్త కట్టుకథేనని.. ఒక మహిళతో అతనికిఅక్రమ సంబంధం ఉందని.. ఈ కారణంతోనే తమ కూతుర్నిచంపి ఉంటారని వారు ఆరోపిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: