కామంతో కళ్లు మూసుకుపోయిన వ్యక్తులకు చిన్నా పెద్దా అనే వ్యత్యాసం ఉండదు. చిన్నపిల్లలు, ముసలివారిపై కూడా అత్యాచారాలకు పాల్పడతారు. ఇలాంటి ఘటనలు అనేకం వెలుగులోకి వచ్చాయి. ఇదేకోవకే చెందిన మరో ఘటన వెలుగులోకి వచ్చింది. హంగేరీకి చెందిన ఓ కుటుంబం దుబాయ్ నగరంలో నివాసం ఉంటోంది. కొత్త ఇంట్లోకి మారేందుకు సామాన్లు తరలించడానికి ఓ కంపెనీకి చెందిన పాకర్స్ మూవర్స్ సిబ్బందిని పిలిచారు. సిబ్బందిలో ఉన్న పాకిస్థాన్‌కు చెందిన 23 ఏళ్ల యువకుడి కన్ను 8 సంవత్సరాల బాలికపై పడింది.



బాలిక తల్లి వేరే రూంలో సామాన్లు సర్దే పనిలో ఉండగా బాలికపై లైంగిక దాడికి తెగబడ్డాడు. బొమ్మలతో బెడ్‌రూంలో ఆడుకుంటున్న బాలిక వద్దకు వెళ్లిన నిందితుడు  వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో బాలికకు ముద్దు పెట్టాడు. ఏమీ అర్థం కానీ బాలిక భయపడింది. బాలిక తల్లి వద్దకు పరిగెత్తి జరిగిన విషయాన్ని వివరించింది. దీంతో బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2016 చివరిలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం నిందితుడికి 3 నెలల జైలుశిక్ష విధించింది. శిక్షాకాలం పూర్తైన అనంతరం నిందితుడిని దేశం నుంచి బహిష్కరించాలని న్యాయమూర్తి ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: