జేఈఈ మెయిన్‌కు సంబంధించిన 'కీ' మంగళవారం(ఏప్రిల్ 18) విడుదలైంది. విద్యార్థులు జవాబులు నింపిన ఓఎంఆర్ పత్రాలను కూడా సీబీఎస్ఈ వెబ్‌సైట్‌లో ఉంచింది. ఏప్రిల్‌ 18-22వ తేదీ వరకు వాటిని వెబ్‌సైట్లో ఉంచుతారు. 'కీ', వెబ్‌సైట్లో ఉంచిన ఓఎంఆర్ పత్రంపై అభ్యంతరాలు ఉంటే ఆన్‌లైన్ ద్వారా పంపించవచ్చు. తనకు పరీక్ష రోజు ఇచ్చిన ఓఎంఆర్ పత్రం, వెబ్‌సైట్లో ఉంచినది ఒకటి కాకున్నా, తాను గుర్తించిన జవాబులను పరిగణలోకి తీసుకోకున్నా, ఇతర అభ్యంతరాలను అభ్యర్థులు సవాల్ చేయవచ్చు.


Image result for jee exam

ఓఎంఆర్ పత్రంపై అభ్యంతరానికి రూ.1000, 'కీ'కు సంబంధించి ఒక్కో ప్రశ్నపై అభ్యంతరానికి రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ సీబీఎస్ఈ అభ్యర్థి అభ్యంతరంపై ఏకీభవిస్తే చెల్లించిన డబ్బులను తిరిగి ఇస్తారు. సవాల్ చేయడానికి ఏప్రిల్‌ 22వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు అవకాశముంటుంది. ఆన్‌లైన్‌లో పరీక్ష రాసిన వారికి పరీక్ష జరిగిన రోజే ప్రశ్నపత్రం, ఓఎంఆర్ పత్రం ఈ-మెయిల్‌కు పంపించారు. వారు మాత్రం కేవలం 'కీ'పై మాత్రమే అభ్యంతరాలు పంపించుకోవాలని సీబీఎస్ఈ సృష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: