ఉత్తరకొరియాను అదుపు చేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న చర్యలు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. అంతర్జాతీయ రాజకీయ సమీకరణాలను వేగంగా మార్చివేస్తున్నాయి. యుద్ధసన్నాహాలను మొదలుపెట్టించిన ట్రంప్ దక్షిణకొరియా, జపాన్‌ల సహాయంతో ఉత్తరకొరియా సరిహద్దులో అమెరికా సేనలను మోహరిస్తుండడం ఉద్రిక్తతలకు దారితీస్తోంది. ట్రంప్ తీసుకుంటున్న ఈ చర్యలు అగ్రదేశాలైన చైనా, రష్యా దేశాల్లో కదలికలు తీసుకొస్తున్నాయి.



ఉత్తరకొరియాపై ఏ క్షణంలోనైనా దాడి చేసే అవకాశం ఉందని భయపడుతున్నాయి. ట్రంప్‌తో ఇటీవలే చర్చలు జరిపిన చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌ ఉత్తరకొరియా, చైనా సరిహద్దుకి 1,50,000 భారీ సైన్యాన్ని పంపించారు. ఏ క్షణంలోనైనా దాడి జరిగే అవకాశం ఉందని, ఒకవేళ దాడి జరిగితే సరిహద్దును రక్షించుకోవడం, తిరుగుబాటు ఉత్తరకొరియన్లను దేశంలోకి చొరబడకుండా నిలువరించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు. చైనా చర్యలు గురించి తెలుసుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ మరో అడుగు ముందుకేశారు. ఉత్తరకొరియా, రష్యా సరిహద్దుకి భారీగా సేనలు, ఆయుధాలను రైలు ద్వారా తరలించారు. దీంతో ఏ క్షణాన ఏ యుద్ధ వార్త వినాల్సి వస్తుందోనని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: