అమెరికాలో నిరుద్యోగం తగ్గినట్టు తాజాగా వెల్లడైన గణాంకాలు తెలిపాయి. ఏప్రిల్‌ నెలలో నిరుద్యోగ రేటు 4.4 శాతానికి పడిపోవడం గత పదేళ్లలో మొదటిసారి అని మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి. గత మాసంలోనే 2,11,000 ఉద్యోగాలు లభించినట్టు కార్మికశాఖ పేర్కొంది. వినోదం, ఆతిథ్యం, ఆరోగ్య సంరక్షణ, సామాజిక సేవ... రంగాల్లో ఉద్యోగాలు ఎక్కువగా లభిస్తున్నట్టు తెలుస్తోంది. ఉద్యోగాలు ఎక్కువగా లభించడం అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ ఫెడ్‌ ప్రకటించనున్న ద్రవ్య పరపతి విధానంపై ఈ మార్పులు ప్రభావం చూపించవచ్చని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు.



అమెరికాలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రతి నెలా 75 వేల నుంచి 1 లక్ష ఉద్యోగాల కల్పన జరగాల్సివుంది. నిరుద్యోగ రేటు 4.4%కు తగ్గడంపై అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్‌ స్పందించారు. ఉద్యోగాలపై మంచి నివేదిక వచ్చింది. ఇది ఆరంభం మాత్రమే అని ట్వీట్‌ చేశాడు. గత 12 నెలలుగా సగటు ఉద్యోగ వేతనం కూడా పెరుగుతుండటం గమనార్హం. 2.5% వరకు ఈ పెరుగుదల ఉందని కార్మికశాఖ ప్రకటించింది. భవన నిర్మాణరంగంతో పాటు వాణిజ్యసేవ రంగాల్లో ఉద్యోగకల్పన ఆశాజనకంగా ఉందని సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: