అమెరికా తెలుగు సంబరాలను ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) ఘనంగా నిర్వహించింది. చికాగోలోని షాంబర్గ్ వేదికగా జరిగిన ఈ వేడుకలకు తెలుగు రాష్ట్రాల నుంచి అతిరథ మహారథులు విచ్చేశారు. తెలుగు సంప్రదాయాలు ఉట్టిపడేలా.. తెలుగువారిని ఉత్తేజ పరిచేలా ఈ సంబరాలు జరిగాయి.రుద్ర శంకరం, అన్నమాచార్య కీర్తనలు, సౌండ్ ఆఫ్ ఇషా, వెంకటాచల నిలయం, బాల రామయణం లాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇక్కడ వచ్చి వారిని భక్త ప్రవాహంలో ఓలలాడించాయి. సంబరాల వేదికపై బతుకమ్మ ఆడి ఏ దేశమేగినా జన్మభూమిని మరువమంటూ ప్రవాసులు చాటారు. కూచిపూడి, కథక్ లాంటి సంప్రదాయ నృత్యాలు కూడా ప్రవాసుల్లో భారతీయ కళల పట్ల ఉన్న మక్కువ ఏ పాటిదో చూపించాయి. అమెరికాలో ఏడేళ్ల తెలుగు బాలుడు ఆకాశ్ ఊకోటి  తో స్పెల్ బీ పై నిర్వహించిన కార్యక్రమానికి అద్భుతమైన స్పందన లభించింది. కచ్చపి కళాపీఠం వారు 'భువన విజయం' పద్య నాటకం ప్రదర్శించారు. తటవర్తి కల్యాణ చక్రవర్తి రాసిన ఆధునిక చిత్రణతో కూడిన ఈ  'భువనవిజయం', భూమినే నమ్ముకున్న రైతు, తల్లి, మనవడి మధ్య సంఘర్షణపై 'మనలోని మనిషి' నాటికలు అందరిని అకట్టుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: