లండన్‌లోని చారిత్రాత్మక ఇండియన్ జింఖానా  క్లబ్‌లో చారిత్రాత్మక  ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలు ఆశ్ర అంజుమ్ ఉస్మానియా అలుమ్ని యూకే  &యూరోప్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు ఉస్మానియా పూర్వ విద్యార్థి లార్డ్ కరణ్ బిలిమొరియా(చాన్సలర్, బర్మింగ్‌హామ్‌ యూనివర్సిటీ) విశిష్ట  అతిథిగా హాజరయ్యారు. వీరితో పాటు భారత్‌ నుంచి ముఖ్య అతిథులుగా ఉస్మానియా పూర్వ విద్యార్థులు నరపరాజు రాంచందర్ రావు(ఎమ్మెల్సీ), ప్రొఫెసర్ పుట్టి మనోహర్(NCERT మెంబర్), డాక్టర్ దాసోజు శ్రవణ్(సోషల్ వర్కర్), భారత ఎంబసీ నుంచి అంబాసిడర్ విజయ్ వసంత్, అంబాసిడర్ నాగేశ్వర్, వీరేంద్ర శర్మ(MP,లండన్)లు విచ్చేసి అమూల్య సందేశాలను ఇచ్చారు. 



లార్డ్ బిలిమొరియా మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ ప్రపంచానికే ఆదర్శనీయులని అన్నారు. పురాతన విశ్వవిద్యాలయాలకు చిరునామా భారత్ అని ఆక్సఫర్డ్ యూనివర్సిటీకి వందల సంవత్సరాల ముందే నలంద, తక్షశిల ఉన్నాయని, అలాగే 100 ఏళ్ల చరిత్ర గల ఉస్మానియా నుండి నేను పట్టభద్రుణ్ణి అయినందుకు గర్వపడుతున్నానని తెలిపారు. బ్రిటన్, ఇండియా దేశాలు పరస్పరం సహకరించుకుని విద్యా విధానాలను మెరుగుపరుచుకోవాలని అన్నారు. దేశ సంపద సృష్టికర్త  పీవీ   నరసింహారావును దేశానికి అందించిన ఘనత ఉస్మానియాదేనని మాజీ క్రికెటర్ ఆశాబోగ్లే అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: