బ్రిటీష్‌ ఆసియా కమ్యూనిటీలను ఒక్క చోటకు చేరుస్తూ లాభాపేక్ష లేని సంస్థ బాలీహుడ్‌ మీడియా ఆధ్వర్యంలో నిర్వహించిన ‘బాలీఫ్యుజన్‌ 2017’ ఆకట్టుకుంది. బ్రిటన్‌ పార్లమెంట్‌ సభ్యులు రాబెర్టా బ్లాక్‌వుడ్‌ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నగరంలో విభిన్న సంస్కృతులకు సంబంధించిన వారు ఉత్సవాలు జరుపుకోవడం బాగుందన్నారు. పాఠశాల విద్యార్థులు, స్థానిక వైద్యులు, డెంటిస్టులు వివిధ బాలీవుడ్‌ పాటలకు చేసిన నృత్యాలు అలరించాయి.



మాలా క్లెమెంట్‌ కొరియోగ్రఫీలో విద్యార్థులు చేసిన నెమలి నృత్యం హైలెట్‌గా నిలిచింది. డాక్టర్‌ రన్సిత్‌, ఆయన బృందం సితార్‌, శ్రీలంకన్‌ డ్రమ్స్‌ ప్రదర్శన చేశారు. బహుళ సంస్కృతులను ఒకే వేదికపై తీసుకొచ్చేందుకు కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. జెన్సా చేసిన సంప్రదాయ భరతనాట్యం విశేషంగా అలరించింది. బర్మింగ్‌హామ్‌కు చెందిన ఆర్‌ఆర్‌ ప్రొడక్షన్స్‌ ఆధ్వర్యంలో లైవ్‌ మ్యూజిక్‌ షో జరిగింది. సెయింట్‌ లియోనార్డ్‌ పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి 500 మంది అతిథులు హాజరయ్యారు. ఈశాన్య ఇంగ్లాండ్‌లో మొదటిసారిగా నిర్వహించిన బాలీఫ్యూజన్‌ చక్కని ఆదరణ లభించిందని బాలీహుడ్‌ మీడియా నిర్వాహకులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: