తెలంగాణ కల్చరల్‌ సొసైటీ ఆధ్వర్యంలో సింగపూర్‌లో తొలిసారిగా బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. స్థానిక సుంగే కేడట్‌లోని శ్రీఅరకేసరి శివన్‌ టెంపుల్‌లో జాతర కనుల పండువగా సాగింది. మహిళలు భక్తిశ్రద్ధలతో దుర్గాదేవికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వూరేగింపులో పోతురాజు వేషాలు, తొట్టెలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జాతర వేడుకను తెలంగాణ ప్రజలతో పాటు తెలుగు వారందరూ స్థానికులతో కలిసి ఘనంగా జరుపుకున్నారు. టీసీఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో తొలిసారిగా సింగపూర్‌లో బోనాల పండుగను జరపడంతో ఈ వేడుక చరిత్రలో నిలిచిపోవడం సొసైటీకి అదృష్టమన్నారు.



సమస్త ప్రజలపై మహంకాళి తల్లి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. సంబురాల్లో పాల్గొన్న వారికి సొసైటీ అధ్యక్షులు బండ మాధవరెడ్డి, ఉపాధ్యక్షులు నీలం మహేందర్‌, పెద్ది శేఖర్‌ రెడ్డి, బూర్ల శ్రీను, ముదాం అశోక్‌, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్‌రెడ్డి, కోశాధికారి గడప రమేశ్‌, కార్యవర్గ సభ్యులు అలసాని కృష్ణ, చిల్క సురేశ్‌, దుర్గాప్రసాద్‌, మిర్యాల సునీత, ఎల్లారాం, పెద్దపల్లి వినయ్‌, ప్రవీణ్‌, గార్లపాటి లక్ష్మారెడ్డి, గరెపల్లి శ్రీనివాస్‌, శివరామ్‌, చెట్టిపల్లి మహేశ్‌, ఆర్‌.సి రెడ్డి, నల్లా భాస్కర్‌, దామోదర్‌, భరత్‌లు కృతజ్ఞతలు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: