అమెరికాలోని అట్లాంటాలో అన్నమయ్య, త్యాగయ్య, శ్రీరామదాసు, పురందరదాసు, ముత్తుస్వామి దీక్షితార్, సదాశివ బ్రహ్మం వంటి వాగ్గేయకారలు, కీర్తనలు రుచిచూపిస్తూ ఆబాలగోపాలన్ని అలరిస్తూ అత్మానందమేగాక ఆధ్యాత్మిక ప్రపంచానికి పరిచయం చేస్తున్న శ్రీమతి స్వాతి.  అట్లాంటాలోని తెలుగువారు వారాంతాల్లో విధిగా ఏదో సందర్భాన్ని పురస్కరించుకుని కలుస్తుంటారు. స్వాతి శ్రీకాంత్ దంపతులు కూడా ఈ గెట్ టు గెదర్ లలో ఉత్సాహంగా పాల్గొనేవారు. హైదరాబాద్ లోని ప్రతిమా శశిధర్ గారి దగ్గర తీసుకున్న కర్ణాటక సంగీత శిక్షణ కూడా వృథా కాకూడదని స్వాతి భావించారు.

మరో వైపు 2013లో సరస్వతీ మ్యూజిక్ అకాడమీని నెలకొల్పి తెలుగు బాలబాలికలకు,ఆసక్తి ఉన్న మహిళలకు స్వచ్చందంగా శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టారు.  శ్రీమతి స్వాతి, శ్రీకాంత్ దంపతు శ్రమ వృథా కాలేదు. తెలుగులో పట్టులేకున్నా, ఆ పిల్లలు తొందరగానే సంగీతంలో పట్టు సాధించగలిగారు. ఇప్పటివరకూ వివిధ వయసుల్లోని 400మందికి స్వాతి దిగ్విజయంగా శిక్షణ ఇచ్చారు.

తానా, ఆటా, నాటా వంటి సంస్థల కార్యక్రమాలు, హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటా వంటి ఆధ్యాత్మిక కేంద్రాల్లో సంగీత ప్రదర్శనలను నిర్వహించి పలువురి ప్రశంసలను చూరగొన్నారు.సంగీతానికి విస్తృత వేదిక కల్పించడం ద్వారా సాటి తెలుగు వారికి ఎంతో కొంత ఊరట కల్పించవచ్చునని భావించారు. భారతీయ సంస్కృతీ, సంప్రదాయాల పట్ల ఎనలేని అభిమానం ఉన్న ఆమె మన సంగీతాన్ని నేర్పించడం ద్వారా తెలుగు బాలబాలికల్లో భారతీయ విలువలను పాదుగొల్పవచ్చునని భావించారు.  

ఒక పక్క సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో క్షణం తీరుబడి లేకున్నా భర్త శ్రీకాంత్ తో సహాయ సహాకారాల వల్లే సంగీత రంగంలోను కృషి చేయగలుగుతున్నానని శ్రీమతి స్వాతి కరి చెప్పారు. కుటుంబ సహాయ సహకారాలతో ప్రశాంతంగా తెలుగువారికి సంగీతం నేర్పించగలుగుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: