ఉన్నత విద్యలు అభ్యసించి మంచి ఉద్యోగం సంపాదించి భవిష్యత్ లో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ప్రతి విద్యార్థి అనుకుంటారు.  అయితే  కొంత మందికి అంది వచ్చిన అవకాశంతో పైకి వస్తే..కొంత మంది విదేశాల్లో విద్యనభ్యసించి మంచి పొజీషన్ కి వస్తుంటారు.  ముఖ్యంగా ఐటీ, మెడిసన్ విద్యల కోసం చాలా మంది విదేశీ బాట పట్టడం చూస్తూనే ఉన్నాం.  తాజాగా  విదేశంలో ఉన్నత విద్యనభ్యసించి మంచి బాటకు పునాధులు వేసుకుందాం అనుకున్న ముగ్గురు విద్యార్థులు ఆశలు అవీరి అయ్యాయి.  
hyd-students-ukrain
హైదరాబాద్ కు చెందిన ఇద్దరు  వైద్య విద్య కోసం ఉక్రెయిన్ వెళ్లారు. మృతి చెందిన విద్యార్థులను హైదరాబాద్ హయత్ నగర్ కు చెందిన శివకాంత్ రెడ్డి, బీఎన్ రెడ్డి నగర్ కు చెందిన అశోక్ మూర్తిలుగా గుర్తించారు. ముఖేశ్ అనే మిత్రుని కాపాడటానికి వెళ్లిన మరో ఇద్దరు యువకులు కూడా సముద్రంలో కొట్టుకుపోయారని చెబుతున్నారు.
Image result for ఉక్రెయిన్ తెలుగు విద్యార్థులు
హయత్ నగర్ కుంట్లూర్ కి చెందిన శివకాంత్ రెడ్డి, బీఎన్ రెడ్డికి చెందిన అశోక్ ఇద్దరూ ఉక్రెయిన్ లోని జాపోరోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో MBBS చదువుతున్నారు. కాలేజీ సెలవులు కావటంతో.. సమీపంలోని నది ఒడ్డున వాలీబాల్ ఆడుతున్నారు. వీరు ఆడుకుంటున్న బంతి నదిలో పడటంతో ముఖేశ్ అనే యువకుడు నదిలోకి దిగాడు.
Image result for ఉక్రెయిన్ తెలుగు విద్యార్థులు
అతను నీళ్లలో కొట్టుకుపోతుండగా.. కాపాడటానికి వెళ్లారు శివకాంత్, అశోక్. ప్రమాదంలో ముఖేశ్ క్షేమంగా బయటపడగా.. అతన్ని కాపాడటానికి సముద్రంలోకి వెళ్లిన ఇద్దరూ అలల ఉధృతికి కొట్టుకుపోయారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు.  ఈ మధ్యే మూడు నెలల సెలవులకు వీరు స్వస్థలాలకు వచ్చి, తిరిగి ఉక్రెయిన్ వెళ్లారు.


మరింత సమాచారం తెలుసుకోండి: