భారత దేశం నుంచి ఇప్పటి వరకు ఎన్నో దేశాలకు ఎంతో మంది వలస వెళ్లారు.  అయితే అక్కడ మన సంస్కృతి, సాంప్రదాయాలు కొనసాగిస్తూ..పండుగలు, కల్చరర్ ప్రోగ్రామ్స్ కండెక్ట్ చేస్తున్నారు.  ఇక ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. తాజాగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ట్రాయిలోని ఫైర్‌ఫైటర్స్‌ పార్కులో మన ఊరి కోసం-5కె రన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో డెట్రాయిట్‌ పరిసర ప్రాంతల ప్రవాసులు పెద్ద  సంఖ్యలో ఉల్లాసంగా పాల్గొన్నారు.  దేశవ్యాప్తంగా 40కు పైగా నగరాల్లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా  అందే నిధులను స్వదేశంలో ప్రవాసులు ఎంచుకున్న గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల కోసం వెచ్చిస్తామని తానా ఫౌండేషన్‌ చైర్మన్‌ శృంగవరపు నిరంజన్‌ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తానా మాజీ అధ్యక్షుడు కోమటి జయరాం హాజరయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి: