గ్రీన్ కార్డు మంజూరులో నిభందనలు ఇక కఠినతరం కానున్నాయి అంటున్నారు..అమెరికాలో స్థిరనివాసానికి అవకాశం కల్పించే గ్రీన్‌ కార్డు మంజూరులో లాటరీ విధానానికి స్వస్తి పలకనున్నారు. సుమారు ఏటా 55 వేల మందికి లాటరీ ద్వారా గ్రీన్‌ కార్డులను జారీ చేస్తున్నారు. ఇకపై ప్రతిభ ఆధారంగానే గ్రీన్‌కార్డులను జారీ చేయనున్నారు.


 అమెరికాలో స్థిరనివాసం ఏర్పరచుకునే అవకాశం కల్పించే గ్రీన్‌ కార్డు జారీలో నిబంధనలను కఠినం చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ నిర్ణయించారు. ఈ విషయం లో ట్రంప్ ఎప్పటినుంచో దూకుడుగా ఉన్నారు..కొన్ని నెలల క్రితం భారతీయుల ఉద్యోగాలకి ఎసరు పెట్టె  ప్రయత్నం చేసి విఫలం అయ్యిన విషయం అందరికీ తెలిసిందే..

 

ఇప్పుడు గ్రీన్‌కార్డు మంజూరులో లాటరీ విధానాన్ని తక్షణం రద్దు చేయాలని కాంగ్రెస్ ను  కోరనున్నట్లు ఆయన తెలిపారు. న్యూయార్క్‌లో ఉగ్రదాడికి పాల్పడిన ఉజ్బెకిస్థాన్‌కు చెందిన సైఫుల్లా లాటరీ విధానం ద్వారా గ్రీన్‌కార్డును సంపాదించి అమెరికాలో స్థిరపడినట్లు తేలడంతో ట్రంప్ ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

 

అంతేకాదు సైపుల్లా మాత్రమే కాదు అతని ద్వారా మరొక 23 మంది అమెరికాలోకి వచ్చిన విషయాన్ని సీరియ్‌సగా పరిగణిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయం మీద దర్యాప్తు ప్రాంభించారు..అయితే లాటరీ విధానానికి స్వస్తి పలకాలని ఎప్పటి నుంచో తాను ప్రతిపాదిస్తున్నా డెమెక్రాట్లు అడ్డుకుంటున్నారని ట్రంప్‌ విమర్శించారు. అంతేకాదు ఈ లాటరీ  పాటుగా చైన్‌ మైగ్రేషన్‌ వ్యవస్థకూ స్వస్తి పలకాలనీ ప్రతిపాదిస్తున్నారు. ఈ పరిణామాలతో గ్రీన్ కార్డు మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు ఎంతో ఆందోళనకి లోనవుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: