సరిగ్గా  పది నెలల క్రితం అంటే ఫిబ్రవరి నెలలో అమెరికాలు భారతీయులపై జాత్యహంకార దాడులు జరిగాయి..కాల్పుల ఘటన కూడా జరిగింది..అప్పట్లో కొలరాడోలోని పీటన్‌ నగరంలో భారతీయుడి ఇంటిపై కొందరు అమెరికన్లు దాడి చేశారు. అమెరికాలో ఉండొద్దంటూ అతని ఇంటికి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లు అంటించారు. అంతటితో ఆగకుండా న్యూయార్క్‌ మెట్రో రైలులో భారతీయ యువతిని వేధింపులకు గురి చేశారు..

 

సరిగ్గా ఇప్పుడు మళ్ళీ అలాంటి ఘటనే జరిగింది ..అమెరికాలో మరోసారి జాతి విద్వేషం పెల్లుబికింది. భారతీయులు, చైనీయులు తమ నగరాన్ని ఆక్రమించుకుంటున్నారని..ఇకనైనా తమ నగరాన్ని nవదిలేయాలని..న్యూజెర్సీలోని ఎడిసన్‌ నగరంలో కరపత్రాలు దర్శనమిచ్చాయి. ఏసియన్‌-అమెరికన్‌ స్కూల్‌ బోర్డు సభ్యులుగా ఉన్న ఇండో అమెరికన్‌ ఫాల్గుణి పటేల్‌, చైనీస్‌ అమెరికన్‌ జెర్రీ షీలను టార్గెట్‌ చేస్తూ, వారిని బహిష్కరించాలని ఈ కరపత్రాల్లో పేర్కొన్నారు. ‘ఎడిసన్‌ నగరాన్ని మరోసారి గొప్పగా మారుద్దాం’  అనే నినాదంతో కరపత్రాలు కనిపించాయి.

 

ఇదిలా ఉంటే వాషింగ్టన్‌కి చెందిన కెంట్రిడ్జ్‌ హైస్కూలులో తలపాగా ధరించిన 14ఏళ్ల సిక్కు విద్యార్థిపై తన తోటి  విద్యార్థి దాడి చేశాడు. అతనిపై పిడిగుద్దులు గుప్పించాడు. కాగా ఈ ర్యాలీ గురించి తెలిసిన భారతీయులు, చైనీయులు, ఇతర దేశస్థులు భయాందోళనకు గురవుతున్నారు. మళ్ళీ ఫిబ్రవరి నాటి సంఘటనలు ఎక్కడ పునరావృతం అవుతాయో అని భారతీయులు అందోళన వ్యక్తం చేస్తున్నారు..ట్రంప్ అధ్యక్షుడిగా అయ్యాక భారతీయులపై ఈ దాడులు మరీ ఎక్కువ అయ్యాయి.ఏది ఏమైనా అమెరికాలు నివసించే భారతీయులు ఇప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టికుకుని ఉంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: