చాలా మందికి విదేశాలలో ఉద్యోగం చేయాలనే కోరిక ఉంటుంది..ఎంతో ప్రతిభ ఉన్నా సరే వారికి చేయూత ఇచ్చేవాళ్ళు లేకపోవడం వలన ఎంతో మంది విద్యార్ధులు వారి కలలని సాకారం చేసుకోలేకపోతున్నారు. అక్కడకి ఎలా వెళ్ళాలి..ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి..భద్రతా..ఇలా అనేక విషయాలలో ఎన్నో ప్రశ్నలు ఉంటాయి వారికోసం ఏపీ ప్రభుత్వం ఆలోచన  చేసింది. విద్యావేత్తలు, నిపుణులే కాకుండా...చిన్న చిన్న ఉద్యోగాల కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లేవారిపై ప్రత్యేక దృష్టిపెట్టనుంది.


ఇటువంటి వ్యవహారాలూ అన్నీ చూసుకోవడానికి ఏపీఎన్‌ఆర్‌టీ అధ్వర్యంలో అమరావతిలో ఒక ప్రవాస కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. అంతేకాదు పర్యాటకం కోసం విదేశాలకి వెళ్లేవారికి కూడా ఈ కేంద్రం సేవలు వినియోగించుకోవచ్చు. విదేశాలకు వెళ్లాక ఏదైనా ఆపదలో చిక్కుకుంటే సత్వరం ఇక్కడకు సమాచారం చేరేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇదుకోసం ముందుగా తూర్పుగోదావరి ,కడప జిల్లాల్లో శిక్షణ కేంద్రాలను ఏర్పాటుచేయనున్నట్టు తెలిపారు.

 

ఈ కేంద్రంలో ఏపీ నుంచీ గల్ఫ్ దేశాలకి వెళ్ళే వారికి భాషా పరిగ్జ్ఞానం మీద శిక్షణ ఇస్తారు. వారి సెల్‌ఫోన్‌లో ఏపీఎన్‌ఆర్‌టీ ఒక ప్రత్యేక యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసి ఇస్తుంది. విదేశాలలో ఉండేవారు..సమస్యల్లో ఉంటే ఈ  “యాప్‌”ను నొక్కితే చాలు మీ సమాచారం వెంటనే ఏపీఎన్‌ఆర్‌టీ ప్రవాస  చేరేలా రూపొందిస్తున్నారు. ఆ యాప్ వినియోగం వల్ల కొంతవరకు ఇబ్బందులు తగ్గుతాయని ఏపీఎన్‌ఆర్‌టీ ఛైర్మన్‌ వేమూరి రవికుమార్‌ చెప్పారు. జనవరి ఒకటినాటికి ఈ  ప్రవాస కేంద్రంతో పాటు.. జిల్లాల్లో శిక్షణ కేంద్రాలు నెలకొల్పుతారు అని అధికారులు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: