మూడు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా మోడీ ఆదివారం మనిలా చేరుకున్నారు. ఆసియన్  50వ వార్షికోత్సవ సందర్భంగా నిన్న సాయంత్రం ఏర్పాటు చేసిన విందులో మోడీ అమెరికా అధ్యకుడు..చైనా ప్రధానితో వేరు వేరు గా భేటీ అయ్యారు. ఈ విందులో మోదీ అందరితో మాట్లాడుతూ ఉల్లాసంగా కనిపించారు.మోడినే అక్కడ ఎంతో కలివిడిగా ఉన్నారు మోడీ. జపాన్‌ ప్రధాని షింజో అబె, రష్యా ప్రధాని దిమిత్రి మెద్వెదేవ్‌, మలేసియా ప్రధాని నజీబ్‌ రజాక్‌ తదితరులతోనూ మోదీ మాట్లాడారు. విందు సందర్భంగా అక్కడ దిగిన కొన్ని ఫొటోస్ ని మోడీ ట్విట్టర్ లో ఉంచారు. ఈ సందర్భంగా ఫిలిఫీన్స్ జాతీయ దుస్తులైన ‘బరాంగ్‌ తగలాంగ్ దుస్తుల్ని ధరించారు.

 

అయితే సోమవారం జరగనున్న ద్వైపాక్షిక సమావేశం నేపధ్యంలో మోడీ ఆదివారం సాయంత్రం కొద్దిసేపు ట్రంప్ తో ముచ్చటించారు. సోమవారం భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. భారత్‌, జపాన్‌, అమెరికా, ఆస్ట్రేలియా నాలుగు దేశాలు కూటమిగా ఏర్పడాలన్న ప్రతిపాదన అనంతరం తొలిసారి భేటీ అవుతుండడంతో వీరి సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది.

 

చైనా సైనిక చర్యలు ఇండో పస్పిక్ ప్రాంతంలో ఎక్కువగా పెరిగిపోవడం చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతేకాదు ఉగ్రవాదం..తీవ్రవాదం సమస్యలతో పాటు ప్రాంతీయ  వాణిజ్యాన్ని మరింత అభివృద్ధి చేసుకోవడంపై చర్చించనున్నారు అని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ..ఎంతో కీలకమైన ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో చైనా దూకుడుకు చెక్‌ పెట్టేలా భద్రతా సహకారంపై చర్చించేందుకు భారత్, అమెరికా, జపాన్, ఆ స్ట్రేలియా అధికారులు తొలిసారి మనీలాలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు..ఈ విషయం పై విదేశాంగ శాఖ వెల్లడించింది ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, సామరస్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంగా చర్చలు సాగాయని తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: