భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రు జయంతిని పురస్కరించుకుని బాలల దినోత్సవం సందర్భంగా గల్ఫ్ దేశాలో రెండు చోట్ల భారతీయ విద్యార్ధులు గిన్నిస్ రికార్డులను నెలకొల్పారు. ఎలా అని అనుకుంటున్నారా షార్జాలో భారతీయ అంతర్జాతీయ పాఠశాలకు చెందిన విద్యార్ధులు ప్రపంచంలోనే అతి పెద్ద ఓడ ఆకారపు వలయంగా ఏర్పడి రికార్డు సృష్టించారు.

 indian students gunnies record on nehru birthday కోసం చిత్ర ఫలితం

అదేవిధంగా మరొక చోటనే జెద్ధా నగరంలోని భారతీయ అంతర్జాతీయ పాఠశాల విద్యార్థులు ప్రపంచ మధుమేహ వ్యాధి లోగో ఆకారంలో వలయంగా ఏర్పడి రికార్డు సృష్టించారు.భారతీయ విద్యార్ధులు చేసిన ఈ రెండు రికార్డులని గుర్తించి గిన్నిస్ బుక్ లో స్థానాన్ని కల్పించారు.  

 

రోజు సరైన వ్యాయామం లేకపోవడం వల్ల చిన్నారులు మానసికంగా..శారీరకంగా ఎదగలేకపోతున్నారు...అంతేకాదు ఈ కారణాలవలన చిన్నారులలో ఉబ్బసం, మధుమేహం పెరిగిపోతోంది..అంతేకాదు వీటి మీద వారికి అస్సలు అవగాహన కూడా ఉండటం లేదు. అందుకే వారికి అవగాహన కల్పించాలి అనే ఉద్దేశ్యంలో ఈ గిన్నిస్ రికార్డు ప్రయత్నం చేశామని కార్యక్రమాన్ని నిర్వహించిన అబీర్ మెడికల్ గ్రూప్ పెర్కోంది.

 

ఈ మొత్తం గిన్నిస్ రికార్డులో సుమారుగా 4, 600 మంది విద్యార్ధులు పాల్గోన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతీయ కాన్సులేట్ జనరల్ నూర్ రహ్మాన్ షేక్, దౌత్యవేత్తలు, చాలా మంది ప్రముకులు పాల్గొన్నారు..బాలాల దినోత్సవం రోజునే మధుమేహ దినోత్సవం కూడ రావడంతో..ఈ రికార్దుని నెలకొల్పారు


మరింత సమాచారం తెలుసుకోండి: