తమ అవకాశాలని తన్నుకుపోతున్నారు..మా ప్రతిభకి మీరు అడ్డుపడుతున్నారు అంటూ అమెరికాలో ఉంటున్న అతివాదులు ఎంతో మంది ఇండియన్లపై విద్వేషా దాడులకి తెగపడ్డారు..ఇప్పటికీ  “గో బ్యాక్’ అంటూ పోస్టర్స్ కనిపిస్తూనే ఉన్నాయి అంతేకాదు భారతీయ కంపెనీలపై ట్రంప్ కూడా చాలా తీవ్రస్థాయిలో ఆంక్షలు విదించాడు..అయితే ఇప్పుడు అవన్నీ అపోహలే అని తేలిపోయింది.భారతీయ కంపెనీలు అమెరికాలో ఉన్న వాళ్లకి సైతం ఉద్యోగాల కల్పనలో ముందు వరుసలో ఉన్నాయి.

 Image result for indian roots indian compnays one lakhs employemnert

ఇండియన్‌ రూట్స్, అమెరికన్‌ సాయిల్‌’ పేరిట ‘కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సీఐఐ)’ గతేడాది కాలానికి సంబంధించి ఓ నివేదిక వెల్లడించింది. ఆ నివేదికలో భాగంగా..అమెరికాలో ఉన్న మన  భారతీయ సంస్థలు 1,13,000 ఉద్యోగాలు కల్పించినట్లు తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. అంతేకాదు మన కంపెనీలు భారీ ఉద్యోగాలు కల్పనలో మాత్రమే కాకుండా.. మొత్తంగా 18 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. అలాగే కార్పొరేట్‌ సంస్థల సామాజిక బాధ్యతలో భాగంగా 147 మిలియన్‌ డాలర్ల నిధుల్ని కూడా అందించాయి. 

 

అదొక్కటి మాత్రమే కాదు పరిశోధనలు చేసే విషయంలో అభివ్రుదీ కోసం 588 మిలియన్‌ డాలర్లు వెచ్చించాయి. దాదాపు వందకు పైగా భారత కంపెనీలు అమెరికా, అక్కడి సరిహద్దుల్లోని ప్యుర్టొరికో దీవిలోనూ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.మొత్తం మనం భారతీయ కంపెనీలు అమెరికాలో సుమారు  50 రాష్ట్రాల్లోనూ ఈ సంస్థలు పనిచేస్తున్నాయి.అమెరికాలో ఉన్న మన్న సంస్థల ద్వారా సుమారు 87 శాతం భారత సంస్థలు రానున్న మరో ఐదేళ్లలో అమెరికాలో మరింత మంది మందికి  ఉపాది కలిపించేలా ఈ కంపెలు సిద్దంకానున్నాయి అని తెలిస్తోంది.

Image result for indian roots indian compnays one lakhs employemnert

మరింత సమాచారం తెలుసుకోండి: