ఏదేశ మేగినా మన భారతీయుల ఖ్యాతి మాత్రం ఎప్పుడు ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తులో ఉంటుంది. అమెరికా లాంటి పెద్దన్న దేశంలో అయితే మన భారతీయుల హవా అంతా ఇంతా కాదు..అమెరికాలో భారతీయుల మద్దతుకోసం అక్కడ పార్టీలో పడరాని పాట్లు పడుతూ ఉంటాయి కూడా. మన వాళ్ళకి అక్కడ ఇచ్చే గౌరవ గుర్తింపు..ఏకంగా ప్రభుత్వంలోనే పని చేసే అవకాశాలు ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేకమైన పదవులు అమెరికా ప్రభుత్వం లో చేపడుతూ ఉంటారు.

america deputy mayor shephali కోసం చిత్ర ఫలితం

తాజాగా అమెరికాలో డిప్యూటీ మేయర్‌గా చెన్నైకు చెందిన మహిళ ఎన్నికయ్యి సంచలనం సృష్టించారు..ఆమె పేరు  షెపాలి రంగనాథన్‌(38) ఈమె అమెరికాలో సీటిల్‌ నగర డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు.అంతేకాదు ఈమె ఒక స్వచ్చంద..సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. షెపాలి తండ్రిపేరు రంగనాథన్‌,తల్లి పేరు షెరిల్‌, తల్లి తండ్రులు చెన్నై లోనే ఉంటున్నారు..స్టెల్లా మేరీస్‌ కళాశాలలో బీఎస్సీ జువాలజీ పట్టా పొందారు షెపాలి.

 

అంతేకాదు ప్రముఖ అన్నావర్సిటీలో ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌లో బంగారు పతకాన్ని కూడా పొంది 2001లో ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లారు. అమెరికాలో అనేక స్వచ్చంద సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండే షెపాలి కి మేయర్ గా ఆమె ఎన్నిక కావడం ఎంతో గర్వకారం అని ఎన్నారైలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: