భారత సంతతి వ్యక్తులని..ఎన్నారైలని గుర్తిస్తూ...జారీ చేసేటువంటి ఓసీఐ (ఓవర్సీస్‌ సిటిజన్‌ ఆఫ్‌ ఇండియా) కార్డులు పొందడానికి తుది గడువు డిసెంబర్ 31, 2017 తేదీ వరకు ఉందని అబుదాబిలోని ఇండియన్ ఎంబసీ అధికారులు తెలియచేశారు.అయితే  పీఐవో (పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్) కార్డు స్థానంలో ఉచితంగా “ఓసీఐ” కార్డులను అందిస్తున్నామని, ఈ సౌకర్యాన్ని ఎన్నారైలు ఉపయోగించుకోవాలని అధికారులు తెలిపారు. మరోమారు ఫైనల్ డేట్ ఇవ్వలేమని అధికారులు స్పష్టం చేశారు. డిసెంబర్ 31, 2017 తేదీ తర్వాత “పీఐవో” కార్డులతో భారత్‌కు రావాలనుకునేవారిని ఇండియన్ ఇమ్మిగ్రేషన్ కౌంటర్ల వద్ద తిరస్కరిస్తారని ఈ విషయంలో ఎటువంటి రాజీ లేదని మీడియా ద్వారా తెలియజేశారు. అందువల్ల  పీఐవో కార్డు ఉన్న వ్యక్తులు ఓసీఐ కార్డు తీసుకోవాలని సూచించారు. 

Related image

ఓసీఐ కార్డు వల్ల ఉపయోగాలు ఇవే

 

 దేశ విదేశాల్లోని ఉంటున్న ఎన్‌ఆర్‌ఐలకు ద్వంద్వ పౌరసత్వం కలిగించేలా భారతదేశం ఓసీఐ కార్డును ప్రవేశపెట్టింది. అయితే ఈ కార్డును పౌరసత్వంగా కాక మల్టిపుల్‌ వీసాగా పరిగణించాలని కోరింది. అయితే “ఓసీఐ” కార్డును పొందడం వలన  ఎన్‌ఆర్‌ఐలకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెప్తున్నారు అవేంటే చుడండి. 

 

1. ఈ “ఓసీఐ” కార్డు ఉంటే  భారత్‌లో ఉండే సమయంలో ఎన్ని రోజులు ఉండాలో నిర్దేశిస్తూ స్థానిక పోలీసు అధికారుల   నుంచి గుర్తింపు పొందనవసరం లేదు

 

2.  “ఓసీఐ”  కార్డు లైఫ్‌ లాంగ్‌ వీసాగా పనికొస్తుంది. దీని ద్వారా తమ జీవితకాలంలో ఎన్నిసార్లయినా భారత్‌కు రావచ్చు.

 

 3. తోటలు, వ్యవసాయ భూముల కొనుగోలు విషయంలో తప్ప ఆర్థిక, విద్య వంటి మిగిలిన అన్ని విషయాల్లో భారతీయ పౌరులతో సమానంగా గుర్తిస్తారు.

 

4. పిల్లలు లేని వారు..దత్తత తీసుకునే విషయంలో సమానత్వం ఉంటుంది.

 

5. డాక్టరేట్‌, డెంటిస్ట్‌, నర్స్‌, ఫార్మసిస్ట్‌, లా, సీఏ వంటి కోర్సులను నిబంధనల ప్రకారం భారతీయ పౌరులతో పాటు చదువుకోవచ్చు.

 

 

6. జాతీయ పార్కులు, వణ్య ప్రాణుల సంరక్షణ కేంద్రాల సందర్శనలో భారతీయులకుండే ప్రవేశ రుసుమునే ఈ కారు హోల్డర్స్‌ కట్టాల్సి ఉంటుంది.

 

7. దేశ వ్యవహారాల్లో భారత పౌరునికి ఉండే అన్ని హక్కులూ ఎన్‌ఆర్‌ఐలకు ఉంటాయి. 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: