సుమారు గత 12 ఏళ్లుగా గల్ఫ్‌ జైల్లో మగ్గుతున్న ఐదుగురు సిరిసిల్ల వాసులు ఎప్పుడు భారత్ వస్తామా,తమ కుటుంభ సభ్యులని కలుసుకుంటామో అంటూ వేచి చూస్తున్నారు..వివరాలలోకి వెళ్తే...2005లో దుబాయ్‌లో విద్యుత్‌ తీగలు దొంగతనం చేయడంకోసం అక్కడ సెక్యూరిటీ గా ఉన్న నేపాల్ కి చెందిన దిల్ బహుదూర్ ని హత్య చేశారు అన్న ఆరోపణలపై తెలంగాణా..సిరిసిల్ల మండలం పెద్దూర్‌కు చెందిన శివరాత్రి మల్లేశం, రవి, హన్మంతు, జగిత్యాలకు చెందిన నాంపెల్లి వెంకట్‌, కోనరావుపేట మండలం నిమ్మపల్లికి చెందిన దండుగుల లక్ష్మణ్‌, అబ్దుల్‌ కరీంలకు జీవిత ఖైదు విధించారు

 Image result for gulf jail

వీరిలో రవి,వెంకట్ ,లక్షణ్ ,మల్లేశం, హన్మంతులకు 24 సంవత్సరాల జైలు శిక్ష పడింది.. పడగా, వీరందరూ 12 ఏళ్లుగా జైల్లోనే ఉన్నారు. అయితే గల్ఫ్ చట్టం ప్రకారం హతుడి భార్యకు నష్ట పరిహారం చెల్లించి, ఆమె క్షమాభిక్షకు అంగీకరిస్తే దోషులను విడుదల చేస్తారు.అయితే ఈ నష్ట పరిహారానికి ఆమె ఒప్పుకోవడంతో 15 లక్షల కోసం కిడ్నీలు అమ్ముకోవడానికి అనుమతి ఇవ్వాలని జైల్లో మగ్గుతున్న వ్యక్తులు మానవ హక్కుల కమిషన్‌ను కోరడం గతంలో ఎంతో సంచలనం కలిగించింది.

 

ఈ విషయం తెలుసుకున్న తెలంగాణా ఐటీ మంత్రి కేటిఆర్ స్పందించి ఆ సొమ్మును సమకూర్చారు. ఇది మృతుడి భార్యకు అందించి మూడేళ్లు గడిచింది. క్షమాభిక్ష పత్రాల్లో లోపాలు ఉన్నాయంటూ దుబాయ్‌ రాయబారి కార్యాలయం నుంచితిప్పి పంపారు..ఈ సందర్భంలో జగిత్యాలకు చెందిన అబ్దుల్‌ కరీం విడుదల అయ్యాడు..మిగిలిన వారు జైల్లోనే ఉన్నారు..వీరి విడుదలకి కేటిఆర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ ని కలిసి వీరి తెలంగాణా వాసుల భాదలని వివరించారు..తప్పకుండ అందరి విడుదలకి సాయం చేస్తాను అని కేటిఆర్ కి మాట ఇచ్చారు సుష్మా స్వరాజ్ .

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: