అమెరికా వెళ్లి బాగా స్థిరపడాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు..ఒకప్పుడు భారతీయులకి బ్రహ్మరధం పట్టిన అమెరికా ఇప్పుడు ట్రంప్ లాంటి వారి వల్ల భారతీయుల ఆశలపై నీళ్ళు చల్లుతోంది..అమెరికాలో భారతీయుల జాడ తగ్గించే ప్రయత్నాలు ట్రంప్ ఎన్నో చేశాడు కానీ అవేమి చెల్లుబాటు కాలేదు..ఇప్పుడు వీసా నిభందనల పేరిట ఎప్పటికప్పుడు భారతీయుల రాకని అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది..దానికి కారణం మన ప్రతిభా..మన తెలివితేటలే..అదే ఇప్పుడు అమెరికన్స్ కి మింగుడు పాడని విషయం.

 Related image

అమెరికాలో వీసాల తిరస్కరణం విషయంలో మునపటి కంటే కూడ ఇప్పుడు అధికంగా ఉందట.అన్ని ధ్రువీకరణ పత్రాలు ఉంటేనే అగ్రరాజ్యంలోకి అనుమతి ఇస్తారు. పత్రాలు సమర్పించి, అధికారులను మెప్పించి, ఒప్పించిన వారికే వీసా దక్కుతుంది. ఈ విషయంలో చైనా మాత్రం మనకంటే కాస్త ముందడుగులోనే ఉందట. అమెరికాలో ప్రవేశానికి లభించే వీసాల విషయంలో భారతీయులతో పోలిస్తే చైనా వారికే ఆమోద ముద్ర పడుతోందని తాజా సర్వేలో తేలింది. మనకంటే చైనా వారి వీసా దరఖాస్తులు వేగంగా ముందు కదులుతున్నాయట.

 

2006-2016 మధ్య కాలంలో భారతీయుల వీసా తిరస్కరణ రేటు 6.5శాతం పెరగడం ద్వారా 26శాతానికి చేరింది. ఇక చైనా విషయంలో 12.2శాతం తగ్గి 12.4శాతానికి చేరింది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందే క్రమంలో విదేశీ కంపెనీలకు స్వాగతం పలకడం, పెద్ద సంఖ్యలో అమెరికన్‌, యూరోపియన్‌ బిజినెస్‌లను ఆకర్షించడంపై చైనా ప్రధానంగా దృష్టి సారించడం ఇందుకు కారణమని అంటున్నారు నిపుణులు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే అత్యధికంగా వీసా తిరస్కరణ జరిగిన క్యూబా దేశానికి జరిగిందట సుమారు ఆదేశ తిరస్కరణ రేటు 81.9శాతం.

 India's US visa refusal rate is 26%, up 6.5% between 2006 and 2016. China's US visa refusal rate is 12.4, down 12.2% in the same period.


మరింత సమాచారం తెలుసుకోండి: