ఇప్పుడు సోషల్ మాధ్యమాలలో ఈ కుర్రాడి గురించే చర్చ..ఒక సాధారణం కుటుంభంలో జన్మిచిన ఈ కుర్రాడు ఏకంగా ఆఫ్రికాలోని అనేక గ్రామాలకి వెలుగులు ఇచ్చాడు. ఒక సాధారణ కుటుంభంలో జన్మించిన యువ పారిశ్రామికవేత్త శ్రీ సాయి సుబ్రహ్మణ్యం ఢిల్లీ లో స్టార్టప్ ని ఏర్పాటు చేసి ఆఫ్రికాలో వెలుగు పూలు పూయిస్తున్నాడు.తల్లి తండ్రులు ఇద్దరు టీచర్స్..బిట్స్ పిలానీలో బీటెక్ చేసిన సాయి..చాలా భిన్నంగా ఆలోచన చేశాడు..

 Image result for africa solar power

పచ్చిమ ఆఫ్రికాలో విద్యుత్‌లేని గ్రామాలను ఎంచుకుని విద్యుత్‌ సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా ప్రాజెక్టు కొనసాగిస్తున్నాడు.బిట్స్‌ పిలానీలో ఉన్న తన  ప్రొఫెసర్స్ సహాయంతో  సోరేవా ఎనర్జీ పేరుతో ఒక కంపెనీని సహచరులతో కలిసి ఢిల్లీ లో  ఏర్పాటు చేశాడు. 

 

గ్రీడ్‌ మారు మూర ప్రాంత్రాలు అంటేనే ప్రకృతికి దగ్గరగా ఉంటాయి వారికి కాలుష్యం గురించి తెలియదు..నేను చేపట్టాలి అనుకున్న ప్రాజెక్ట్ కాలుష్య రహిత ప్రాజెక్ట్ అందులోనూ ఎన్నో గ్రామాలకి వెలుగులు నింపుతుంది అంటున్నాడు సాయి..ఒక్కో  గ్రామానికి ప్రాజెక్టుకు గాను  3 కోట్ల రూపాయల నుంచి 4 కోట్ల రూపాయల వరకు వ్యయం అవుతుంది. దీని వల్ల మారుమూల ప్రాంతాలకు కూడా విద్యుత్‌ సౌకర్యం కల్పించొచ్చు. నేను చేపట్టిన ప్రాజెక్టు కోసం సుమారు రూ.6 నుంచి రూ.7 లక్షల వరకు ఖర్చు చేశాను. పరిశోధనలు చేస్తున్నాను. వివిధ దేశాల ప్రతినిధులకు కూడా వివరించాను..దాని ఫలితాలు మాత్రం ఎంతో మందికి ఉపయోగపడుతాయి అని చెప్తున్నారు సాయి సుబ్రహ్మణ్యం.

 

సోలార్‌ గ్రిడ్‌ ఉద్దేశ్యాన్ని, దాని ఉపయోగాన్ని  నేను ప్రపంచానికి వివరించేదుకు నాకు ఒక మంచి అవకాశం దొరికింది..సుమారు 60 దేశాల నుంచి పెద్ద పెద్ద కంపెనీల సారథులు..యువపారిశ్రామిక వేత్తల సదస్సుకు వస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కుమార్తె ఇవాంకా కూడా ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ ల నిర్మాణానికి ఎంతో వ్యయం అవసరం అవుతుంది అందుకు గాను ఆప్రికాలో ప్రాజెక్టు ఏర్పాటు కోసం ఐక్యరాజ్యసమితి..ప్రభుత్వరంగ ఫండింగ్‌ ఏజెన్సీలకు ప్రతిపాదనలు పంపాం వారి నుంచీ  స్పందన వస్తుందనే నమ్మకం నాకు ఉంది ఎందుకంటే ఆఫ్రికాలో ఎన్నో గ్రామాలకి ఈ ప్రాజెక్ట్ వెలుగులు నింపుతుంది అంటూ సాయి సుబ్రమణ్యం తెలిపారు..ఎక్కడో ఉన్న ఆఫ్రికాలో ప్రజలకి ఎంతో మేలు చేకూర్చుతున్న సాయికి ఇప్పుడు భారతీయుల సపోర్ట్ పెరుగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: