బ్రిటన్ లో భారతీయ రెస్టారెంట్లు నష్టాల బాటలో ఉన్నాయి..దానికి కారణం ఆదేశం యొక్క ఇమ్మిగ్రేషన్ పాలసీల కారణంగానే...పరిస్థితులు దృష్ట్యా అక్కడి మాజీ కేబినేట్ మంత్రి ప్రీతీ పాటిల్ “సేవ్ అవర్ కర్రీ హౌసెస్” అంటూ గతంలో ఒక క్యాంపెయిన్ నిర్వహించారు.లండన్ లో సోమవారం రాత్రి బ్రిటిష్ కర్రీ అవార్డ్స్  కార్యక్రమం జరిగింది..ఈ కార్యక్రమానికి బ్రిటన్ ఎంపీ విన్స్ కేబుల్ ముఖ్య అతిదిగా పాల్గొన్నారు.

 Brexit-Vince-Cable

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్రిటన్‌కు దక్షిణాసియా చెఫ్‌ల అవసరం ఎంతో ఉందని వారి కోసం ఏడాది పాటుప్రభుత్వం “కారంగా ఉండే భారతీయ వంటకం” పేరిట వీసాలు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.భారతీయుల వంటలు అమోఘం అని బ్రిటన్ వాసులు ఆ రుచులని ఆస్వాదించాలని అందుకే వారికి ప్రోత్సాహం ఇవ్వడం మంచిది అని తెలిపారు.

 

అంతేకాదు ఈ వీసాలతో భారత చెఫ్‌లు బ్రిటన్‌కు వచ్చి ఇక్కడి రెస్టారెంట్లలో పని చేయొచ్చని.. దీని ద్వారా రెస్టారెంట్ల వ్యాపారం లాభాల బాట పడుతుందని పేర్కొన్నారు. కృత సంవత్సరమే ఈ విందాలూ వీసాలపై బ్రిటన్‌ ప్రధాని థెరిసా మేకు ఇండస్ట్రీ వర్కర్లు అంతా కలిసి 75 పేజీల నివేదిక పంపారు. కానీ ఆమె ఈ విషయంలో స్పందించలేదు..మరోమారు  ఈ నివేదికను పరిశీలించి సత్వర చర్యలు తీసుకోవాలని విన్స్‌ కేబుల్‌ కోరారు. ఈ విందాలూ వీసాలు జారీ చేయడం వల్ల దక్షిణాసియాకి చెందిన చెఫ్‌లు బ్రిటన్‌కు వచ్చి ఇక్కడి జూనియర్‌ చెఫ్‌లకు శిక్షణ కూడా ఇవ్వొచ్చని పేర్కొన్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: