మొన్నటికి మొన్న అమెరికాలో ఒక నగరంలో భారత సంతతి విద్యార్ధి పై జాత్యహంకార దారి జరిగింది..ఇలా అనేక చోట్ల ఎదో ఒక సందర్భంలో ఎక్కోదో ఒక చోట దాడులు జరుగుతూనే ఉన్నాయి.ఇండియాన్స్ గో బ్యాక్ అంటూ నినాదాలు ఫ్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ ఉన్నారు.

 Indian-origin man loses eye during knifepoint robbery in New Zealand

తాజాగా ఇప్పుడు న్యూజిలాండ్‌లోని హామిల్టన్‌ నగరంలో భారత సంతతి వ్యక్తిపై దారుణమైన దాడి జరిగింది. అజిత్ సింగ్ ఫెరారీ డైరీ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. అజిత్‌ సింగ్‌ ఫరార్‌‌పై గుర్తు తెలియని కొందరు దుండగులు దాడి చేశారు. ఫరార్ తన దుకాణంలో ఉన్న సమయంలో ముసుగు ధరించి, కత్తితో ప్రవేశించిన దుండగులు డబ్బులు దొంగిలించే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నాన్ని ఫరారు తీవ్రంగా ప్రతిఘటించాడు.దాంతో వాళ్ళు ఫెరారీ మీద తీవ్రమైన దాడికి పూనుకున్నారు.

 

 ఫరార్‌పై కత్తులతో విచక్షిణారహితంగా దాడి చేశారు. ఇండియన్స్ గో బ్యాక్ అంటూ ముఖంతోపాటు..కంటి లోపల కత్తులతో దాడి చేశారు.కంటి గుడ్డుకూడా బయటకి వచ్చేసిందని..తానూ ఈ దాడిలో తన కంటిని పోగొట్టుకొన్నాడు కూడా.. పలు శరీర భాగాలకు తీవ్రమైన గాయాలయ్యాయి. ఫరార్‌ను హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించి వైద్యమందిస్తున్నారు. పోలీసులకు సమచారం అందించడం ఘటనపై కేసు నమోదు చేశారు. సీసీ కెమేరాల ద్వారా నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: