సత్‌బీర్‌ అరోరా ఇప్పుడు ఈ పేరు లండన్ లో మారుమోగుతోంది..ఇతనేమీ సెలబ్రిటీ కాదు..డబ్బున్న వ్యక్తి అంతకంటే కాదు.పోనీ పొలిటికల్ లీడర్ అనుకుంటే అదీ కాదు..ఇతను ఒక సాధరణ వ్యక్తి..ఒక కారు డ్రైవర్..మరి ఇప్పుడు తను హీరో ఎలా అయ్యాడు అనేకదా డౌట్..హీరో అవ్వాలి అంటే పైన తెలిపిన స్టేటస్ ఏమి అవసరం అలేదు మంచి మనసుంటే చాలు..తెలివి తేటలు ఉంటే సరిపోతాయి అని నిరూపించాడు ఈ డ్రైవర్ “సత్‌బీర్‌ అరోరా” వివరాలలోకి వెళ్తే..

 Image result for sikh driver save girl in london

భారత సంతతికి చెందిన సిక్కు డ్రైవర్‌ అపహరణకు గురయ్యిన 13 ఏళ్ల బాలికను కాపాడి లండన్‌లో హీరో అయ్యారు. సత్‌బీర్‌ అరోరా ఆ పాపని ఎంతో చాకచక్యంగా కిడ్నాప్ నుంచీ రక్షించాడు. ఈ సంవత్సరం ఫిబ్రవరి..20న తన క్యాబ్‌ను ఒకరు బుక్‌చేశారు. అయితే ఎప్పటిలానే అరోరా ప్యాసింజర్‌ను ఎక్కించుకోడానికి వెళ్లగా..స్కూల్  అక్కడ స్కూలు యూనిఫాంలోఉన్న విద్యార్థిని ఉంది, ఆమెతో పాటు 24 ఏళ్ల వ్యక్తి కూడా ఉన్నాడు. ఇద్దరూ క్యాబ్‌లో ఎక్కారు. వీరి వ్యవహారం చూసి అరోరా మనసు ఎందుకో కీడు శంకించింది. కారులో ఎక్కిన వ్యక్తి ఆ బాలికను ఏం చేయబోతున్నాడో ఫోన్‌లో అవతలి వ్యక్తికి వివరించడాన్ని అరోరా గుర్తించారు.

 

అంతే సత్‌బీర్‌ అరోర..తన తెలివితేటలకి పని చెప్పాడు వెంటనే తన భార్యకి ఫోన్ చేశాడు..ఆ బాలిక గురించిన వివరాలు తెలుసుకోమని తెలుసుకోమని తన భార్యకు ఫోన్‌ ద్వారా తెలియజేశారు. కిడ్నాప్ కి ఈ బాలిక గురయ్యింది అని తెలుసుకున్న సత్‌బీర్‌ అరోరా..దీంతో దగ్గరలోని పోలీసు స్టేషన్‌కు సమాచారం అందించాడు అప్రమత్తమైన పోలీసులు ఆ కిడ్నాపర్‌ని అరెస్టు చేశారు.బాలిక కిడ్నాప్ విషయంలో ఎంతో చాకచక్యంగా వ్యవహరించిన సత్‌బీర్‌ అరోరా తీరుని అక్కడ ప్రతీ ఒక్కరు మెచ్చుకున్నారు..తన తెలివితేటలకి,బాలికని రక్షించినందుకు గాను అరోరాకు ‘అవుట్‌ స్టాండింగ్‌ ఎచీవ్‌మెంట్‌ ఇన్‌ సేఫ్‌గార్డ్‌’  సర్టిఫికెట్‌ను అక్కడి జిల్లా కౌన్సిలర్‌ కీరోన్‌ మాలన్‌ అందించారు.అందుకే ఇప్పుడు అక్కడ సత్‌బీర్‌ అరోరా హీరో అయిపోయాడు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: